Home » ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం సాంగ్ లిరిక్స్ – Janulyri

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం సాంగ్ లిరిక్స్ – Janulyri

by Lakshmi Guradasi
0 comment
51

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

అడుగడుగున మంటలు పెడుతున్న చరితము
హత్యచారాలకు అవుతుంది నిలయము
నడిరోడ్డున చంపుతున్న స్పందించాని సమాజం
నడిరోడ్డున చంపుతున్న స్పందించాని సమాజం

దిన దిన దినమున దిగజారుతు
బతుకుతుంది ఈ జగం

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

కడుపులోనే ఆడదాని తెలుసుకుంటారు
కారుణ్యము ఏకమమ్ము సంపుతున్నారు
పసిపిల్లలమని చూడక మీ కామముతో
పాలబుగ్గలెన్నో చిదిమివేస్తావున్నారు

అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు
అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు
ఎందుకు ఎంతలా మాకు తలపెడితిరి ముప్పు

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

నార్యన్తే పూజ్యంతే అని పలుకుతుంటారు
ధర్మ గ్రంధాల్లో ఆడదాన్ని వంచిస్తారు
భారత మాతకు జై అని గర్జిస్తారు
భారత మాత బొమ్మకిచ్చే విలువ ఇవ్వరు

ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా
ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా
ఈ ఆధునికపు భారత మాత అంటే మీకు అలుసా

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

న్యాయన్ని కులము పేర తీర్పు చేస్తారు
రాజ్యాంగపు హక్కులను కాలరాస్తారు
నిర్భయ దిశా సమతా చట్టాలు వచ్చిన
కామాంధుల ఆగడాలు ఆపగలిగేనా

మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం
మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం
ఇలలో ఏ మహిళనైనా గౌరవిస్తే అది సాధ్యం

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

అడుగడుగున మంటలు పెడుతున్న చరితము
హత్యచారాలకు అవుతుంది నిలయము
నడిరోడ్డున చంపుతున్న స్పందించాని సమాజం
నడిరోడ్డున చంపుతున్న స్పందించాని సమాజం

దిన దిన దినమున దిగజారుతు
బతుకుతుంది ఈ జగం

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం
ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత దేశం

అడుగడుగున మంటలు పెడుతున్న చరితము
హత్యచారాలకు అవుతుంది నిలయము
నడిరోడ్డున చంపుతున్న స్పందించాని సమాజం
నడిరోడ్డున చంపుతున్న స్పందించాని సమాజం

దిన దిన దినమున దిగజారుతు
బతుకుతుంది ఈ జగం

____________________________________

లిరిక్స్ షాన్: రెంజర్ల రాజేష్ (Rangerla Rajesh)
గాయకుడు: లక్ష్మి (Lakshmi)
సంగీతం: రవి కళ్యాణ్ (Ravi Kalyan)
దర్శకుడు: అశోక్ భోగే (Ashok Bhoge)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version