ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలి ఇదేం అల్లరి
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరె ఇదేం గారడీ
నేను కూడా నువ్వయాన పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఓ .. దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలి ఇదేం అల్లరి
నిద్దుర తుంచే మల్లెల గాలి
వద్దకు వచ్చి తానెవరందీ
నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
వెన్నలా కన్నా చల్లగ ఉన్న
చిరునవ్వేదో తాకుతూ ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కన్నుల ఎదుట నువు లేకున్న
మనసు నమ్మదే చెబుతున్నా
ఎవ్వరు ఎవ్వరితో ఏమన్నా
నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైన తెలుసునా
ఏమీటౌతుందో ఇలా నా ఎద మాటున
ఓ.. దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలి ఇదేం అల్లరి
కొండల నుంచి కిందికి దూకే
తుంటరి వాగు నాతో అంది
నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే
ఊపిరి నీకో కబురంపింది
చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎప్పుడూ ఇంత
ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింత
ఎవరి చలవ ఈ గిలిగింత
నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమీ చేస్తున్న పరాకే అడుగడుగున
ఓ ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూఉంది
అరె ఇదేం గారడీ
నేను కూడా నువ్వయాన, పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఓ ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
_________________________
సాంగ్ : ఎక్కడ ఉన్నా పక్కన (Ekkada unna pakkana)
చిత్రం: నువ్వే కావాలి (Nuvve Kavali)
నటులు : రిచా పల్లోడ్ (Richa Pallod), తరుణ్ (Tarun)
సంగీత దర్శకుడు: కోటి (Koti)
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: గోపికా పూర్ణిమ (Gopika Purnima), శ్రీరామ్ ప్రభు (Sriram prabhu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.