Home » ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే సాంగ్ లిరిక్స్ – (Orey baammardhi)

ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే సాంగ్ లిరిక్స్ – (Orey baammardhi)

by Lakshmi Guradasi
0 comments

కాలమాగి చూసిన అనుబందమే ఇదిలే
వయసు మీరిన పాశమే ఒక కావ్యమైనదిలే
రెక్కల ఎప్పుడు కంటి పాపగా కాచులే
రేపునా మాపున చంటి పాపగా చూచులే

ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే లాలించే
అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే

కాలమాగి చూసిన అనుబందమే ఇదిలే
వయసు మీరిన పాశమే ఒక కావ్యమైనదిలే

నిదురనైనా అక్క తలపు కునుకు తియ్యదులే
కలలోను కాపుకాసే కన్ను ముయదులే

అక్కయే జగమని బతికేటి తమ్ముడు వీడురా
అక్కనే బిడ్డాగా పెంచేటి అమ్మైనాడురా
వీడు ప్రేమని పొగడగా భాషలేవి చాలావురా

ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే లాలించే
అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే

ఈమె కోపం మౌనమేలే మాటలుండవులే
ఈమె దుఃఖం మనలమేలే తట్టుకోలేములే

అక్కకి తమ్ముడే తన పంచ ప్రాణాలన్నవి
తమ్ముడి ఊపిరే తన ఊపిరై బ్రతికున్నది
లోకంలోనే అరుదుగా ఉండే బంధం వీరిది

ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే లాలించే
అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే

కాలమాగి చూసిన అనుబందమే ఇదిలే
వయసు మీరిన పాశమే ఒక కావ్యమైనదిలే
రెక్కల ఎప్పుడు కంటి పాపగా కాచులే
రేపునా మాపున చంటి పాపగా చూచులే

ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే లాలించే
అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే

కాలమాగి చూసిన అనుబందమే ఇదిలే
వయసు మీరిన పాశమే ఒక కావ్యమైనదిలే

______________________________________________________________________

చిత్రం: ఒరేయ్ బామ్మర్ది
స్వరకర్త: సిద్ధు కుమార్
గీతరచయిత: వెన్నెలకంటి

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment