Home » ఎదో ఒక రాగం (Edo Oka Raagam) సాంగ్ లిరిక్స్ – రాజా (Raja)

ఎదో ఒక రాగం (Edo Oka Raagam) సాంగ్ లిరిక్స్ – రాజా (Raja)

by Lakshmi Guradasi
0 comments
Edo Oka Raagam song lyrics Raja

ఎదో ఒక రాగం పిలిచింది వేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఎదో ఒక రాగం పిలిచింది వేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

ఎదో ఒక రాగం పిలిచింది వేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే

తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం
ఎదో ఒక రాగం పిలిచింది వేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలో దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరుపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం

ఎదో ఒక రాగం పిలిచింది వేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా

జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఎదో ఒక రాగం పిలిచింది వేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

___________________________

పాట: ఎదో ఒక రాగం (Edo Oka Raagam) (Male)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam)
చిత్రం: రాజా (Raja)
తారాగణం: సౌందర్య (Soundarya), వెంకటేష్ (Venkatesh)
సంగీత దర్శకుడు: S. A. రాజ్‌కుమార్ (S. A. Rajkumar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.