Home » ఎదో ఆశా ఎదలో మొదలైనదీ – గౌతమ్ ఎస్.ఎస్.సి

ఎదో ఆశా ఎదలో మొదలైనదీ – గౌతమ్ ఎస్.ఎస్.సి

by Kusuma Putturu
0 comment
85

ఎదో ఆశా ఎదలో మొదలైనది

ఎపుడూ జాడ లేనిదీ

నిజం తెలుసా ఈనాటిది కాదది

ఇపుడే మెలుకున్నదీ

ఇలా నీ శ్వాస గిల్లీ

లెమ్మంటూ నన్నల్లుకుందీ

నిశీధిలో ఉషోదయంలా

ఎదో ఆశా ఎదలో మొదలైనది

ఎపుడూ జాడ లేనిదీ

ఎపుడూ జాడ లేనిదీ

నీ లాలిని పాడే లాలన నేనూ

జాబిలికై ఆశ పడే బాలను నేనూ

తల్లిగా జోకొట్టీ చలువే పంచాలో

చెలిగా చేపట్టీ చనువే మించాలో

సరిగా నాకే ఇంకా తేలని ఈవేళా

ఎదో ఆశా ఎదలో మొదలైనది

ఎపుడూ జాడ లేనిదీ

నిజం తెలుసా ఈనాటిది కాదది

ఇపుడే మెలుకున్నదీ

నీ నీలి కన్నుల్లో వెతుకుతూ ఉన్నా

క్షణానికో రూపంలో కనబడుతున్నా

జాడవై నా వెంటా నిను నడిపించాలో

జానకై జన్మంతా జంటగా నడవాలో

తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీలా

ఎదో ఆశా ఎదలో మొదలైనది

ఎపుడూ జాడ లేనిదీ

నిజం తెలుసా ఈనాటిది కాదది

ఇపుడే మెలుకున్నదీ

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version