భోగి మంటల్లో తోసేద్దామా భాదలు
కష్టాలు కన్నీళ్లు మోస్తూ ఇంకా ఎన్నాళ్ళు
హే చుక్కలు కలిపితే ముంగిట్లోన ముగ్గులు
చేతుల్నే కలిపితే బలపడిపోవా బంధాలు
అరెరే…ఇట్టగా చెలిమి కొరకు
ఎవ్వరు… అనలేదిదివరకు
అరెరే… ఎంత అన్నదమ్ములైనా
మనలాగా ఉంటారా జల్లెడేసి వెతుకు
దమ్ దమారే దమ్ దమారే దుమ్మురేగి పోవాలిలే
సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే
మిమ్మల్ని చూడగా మనసే నిండిపోయేరా
సంతోషం నట్టింట్లోన చుట్టంలాగా మారేరా
ఏ దిష్టి తగలకుండా పదికాలలా పాటుగా
కలిసి మెలిసి ఉండాలయ్య మీరంతా
రక్తాన్నీ పంచుకు పుట్టినవాళ్ళేం కాదుగా
స్నేహంతో సావాసం చేస్తున్నారే హాయిగా
కాబట్టే పొరపచ్చాలు మచ్చుకైనా రావుగా
వస్తాయంటే రానిస్తామా మేమంతా
రాముడిలాగా ఒకడుంటే లక్ష్మణుడేగా ఇంకొకడు
ఇద్దరి కోసం నేనుంటా ఆంజనేయుడిలా
కొండని కొట్టే బలమున్న బలహీనత మీరంటున్న
ప్రేమని పోసి పెంచారే నన్నో తమ్ముడిలా
అరెరే…ఇట్టగా చెలిమి కొరకు
ఎవ్వరు… అనలేదిదివరకు
అరెరే… ఎంత అన్నదమ్ములైనా
మనలాగా ఉంటారా కట్టే కాలే వరకు
దమ్ దమారే దమ్ దమారే దుమ్మురేగి పోవాలిలే
సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే
దమ్ దమారే దమ్ దమారే దుమ్మురేగి పోవాలిలే
సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే
సాంగ్ క్రెడిట్స్ :
పాట పేరు: దమ్ దమారే (DUM DUMAARE)
సినిమా పేరు: భైరవం (Bhairavam)
నటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manoj Manchu)
గాయకులు: రేవంత్ (Revanth), సాహితీ చాగంటి (Sahithi Chaganti), సౌజన్య భాగవతుల (Soujanya Bhagavatula)
సంగీతం: శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala)
సాహిత్యం: భాస్కరభట్ల (Bhaskarabhatla)
See Also From Bhairavam Songs:
Oo Vennela song lyrics Bhairavam
Bhairavam Theme song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.