అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం
చిన్న నాటి నుండి
జ్ఞానాపకాల తోని
కట్టుకున్న వంతెనేమైంది
ఇంతలోనే వానా
తాకినట్టు ఈ కాలం కూల్చేనా
మనకు మనకు మధ్య
దాచుకున్న మాటలంటూ
లేనే లేవు ఇంతవరకు
ఇప్పుడెందుకో దాచిపెట్టి
ఈ బాదే లోతునా
అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
బాదలోను వుంటేనే దోస్తులు రా
మాది కాదు బాదనుకుంటే
స్నేహం ఉండదు రా
తప్పులోను నీతోనే ఉన్నామురా
గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా
చెప్ప లేని బాదే ఉన్నా
చెయ్యే వదలము రా
నీతో ఉంటూ మాటలు రాని
మౌనం చూడకు రా
మౌనం వెనుకె మాటలు కలిసినా
బాదుంది రా లోపల
స్నేహం లోన కోపాలన్నీ
కరిగే మేఘాలు రా
స్నేహం అంటే ఎప్పుడు ఉండే
ఆకాశమే కదరా
అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
కళ్లలోకి కన్నీరు రాగనే
మాట కొంచెం తడబడు తుండగనే
ఏమయ్యింది మామా అంటూ
అడిగె గొంతువీరా
నీతూంటే నవ్వుతు ఉంటారా
నువ్వుంటేనే మనమని అంటమురా
కారణాలు దొరకవు నువ్వు
దూరం పోవాలన్నా
నీకు నాకు మధ్యలో
దూరం రావాలన్నా
ఒద్దు అంటూ ఆ క్షణన్నీ
ఏడుస్తూ అపానా
గమ్యం చేరే పయణాన్ని
స్నేహం ఆపుతుందా
నీ మంచే కోరి పొమ్మనేంత
ప్రేమే మాకు లేద
అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం
అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం
______________________________________________
చిత్రం: మేమ్ ఫేమస్
గాయకుడు: కాల భైరవ
సాహిత్యం: కోటి మామిడాల, కళ్యాణ్ నాయక్
సంగీతం: కళ్యాణ్ నాయక్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.