ఎవరు ఎవరు చెప్పగలరు
ఎదురు చూపు తీపి
ఎదురు చూసే ప్రేమ కబురునడుగు
నిమిషమాపి
చూపదా కనులలోన దాచుకున్న కలల వాన
ఎంతగా వేచి వేచి కలుసుకుంటే అంత తీయన
ఓ ఓఓ ఓ….. ఎన్ని నాళ్ళని అంతులేని
ఈ ఎదురుచూపులింక చాలే
వీక్షణం వేధించి చంపేంతలా
దూరమెళ్ళకే దూరమవ్వకే
దగ్గరవ్వు నాకివ్వాళే
నిన్నే చూసే రోజేదని
రోజూ ఆలోచిస్తూ ఉంటానే
నిన్ను చూడకుంటే ఊపిరాడదే
అంటోందే ప్రాణం
ఒక్క నిమిషమైన వేచి ఉండదే
గుండెని ఏం చైడం
ఎవరు ఎవరు చెప్పగలరు
ఎదురుచూపు తీపి
ఎదురు చూసే కబురునడుగు నిమిషమాపి
హా… ఆ.. ఆ.. ఆఆ…
ఏకాంత వేళల్లో జారే వెన్నెల
నీ జంట ఎక్కడంటు అడిగే నన్నిలా
ఇన్నాళ్ల మౌనం మాటాడమందే
నీతోటి లోకం చూడాలనుందే
వందేళ్ల కాలం కరిగిపోకముందే
నీతో ప్రయాణం మొదలు పెట్టమందే
ఎవరు ఎవరు చెప్పగలరు
ఎదురు చూపు తీపి
గుండెలోన బాధ కబురు
కళ్ళలోన చూపి
ఇంతగా ప్రాణమిచ్చే
ప్రేమ ఉంటే ఆగుతానా
కొత్తగా రెక్కలేవో కట్టుకొచ్చి
నిన్నిలా చేరనా
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.