డోలీ డోలీ డోలీరే…డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే..
డోలీ డోలీ డోలీరే…డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే..
ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన
అనురాగాలే నిండిపోవా గుండెలోన
ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన
అనురాగాలే నిండిపోవా గుండెలోన
మమతల మాలలు తెచ్చి
ఆ కలతలనే చెరిపేసి
ముంగిట ముగ్గులు పెట్టి
గొబ్బెమ్మల కొలువే చేసి
మనమంతా చేరి ఆడి పాడే వేళా
సంక్రాంతి పండుగ చేద్దామా…సన్నాయి పాటలు విందామా…
సంక్రాంతి పండుగ చేద్దామా…సన్నాయి పాటలు విందామా…
డోలీ డోలీ డోలీరే…డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే..
మా ఇంట రోజూ నవ్వుల రోజా పూలై పూయాలి
పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి
చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి
చూసేటి ఊరువాడ మనసారా దీవించాలి
నలుగురు కలిసి …చేతులు కలిపి…
మన కలలన్నీ…పండించాలి…
ఒకచోట పుట్టని కోడళ్లు అయ్యారు అమ్మకే కూతుళ్లు
త్వరలోనె ముద్దుగా పుడతారు
ఈ తాత పోలికల మనవళ్లు
ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు
డోలీ డోలీ డోలీరే…డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే..
సారీపమాగరి సరిసనిపా…
మా కళ్ల ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం
వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం
మాలక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం
మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం
ఎప్పటి పుణ్యం…ఈ తీయని బంధం…
ప్రేమకి అర్థం…కనిపించని త్యాగం…
ఏ కష్టమొచ్చినా ఏమైనా నోరైనా విప్పడీరామన్న
తను అడవికెళ్లిన మా అన్న రానీడు వెంట వస్తామన్న
తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే…
డోలీ డోలీ డోలీరే…డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే..
ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన
అనురాగాలే నిండిపోవా గుండెలోన
మమతల మాలలు తెచ్చి
ఆ కలతలనే చెరిపేసి
ముంగిట ముగ్గులు పెట్టి
గొబ్బెమ్మల కొలువే చేసి
మనమంతా చేరి ఆడి పాడే వేళా
సంక్రాంతి పండుగ చేద్దామా…సన్నాయి పాటలు విందామా…
డోలీ డోలీ డోలీరే…డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే..
డోలీ డోలీ డోలీరే…డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే..
___________________
చిత్రం : సంక్రాంతి (Sankranthi)
లిరిక్స్ : E S మూర్తి (E S Murthy)
సంగీతం : S A రాజ్ కుమార్ (S A Rajkumar)
గాయకులు : శంకర్ మహదేవన్ (Shankar Mahadevan), చిత్ర (Chitra), కల్పన (Kalpana)
నటీనటులు : వెంకటేష్ (Venkatesh), స్నేహ (Sneha)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.