పలాన పేరని తెలియదు తెలియదు
పలాన ఊరని తెలియదు తెలియదు
ఎలాగ నిన్ను వెతకనే పిల్లా
పలాన దారని తెలియదు తెలియదు
పలాన అలజడి నిలవనే నిలవదు
ఎలాగ నిన్ను కలవనే పిల్లా
గుప్పెడు గుండెను నువ్వే
పట్టుకు పోయావే
నా రెప్పల నిద్దురనంతా
ఎత్తుకుపోయావే
ఊపిరి లోతుల దాక
చొచ్చుకు పోయావే
నా చూపుల నిండుగా నువ్వే
అచ్చై పోయావే
అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఉన్నావో నువ్వు
నే రంగుల రెక్కలు
కట్టుకు వస్తా ఆచూకీ ఇవ్వు
తెల్లవారే రాత్రిలో
తారకలా మాయమయ్యవే
పిల్లగాడి ఊహలలో
ప్రేమ అనే కల్లోలమయ్యావే
హే మాయా సుందరి
హే మాయా సుందరి
హే మాయా సుందరి
హే మాయా సుందరి
నా మాయా సుందరి
నా మాయా సుందరి
ఎక్కడున్నావో మరి
ఎక్కడున్నావో మరి
గుప్పెడు గుండెను నువ్వే
పట్టుకు పోయావే
నా రెప్పల నిద్దురనంతా
ఎత్తుకుపోయావే
నువ్వు కలిసే ముందుగా
ఇలా లేదే కాలం
ఉన్న చోటే ఉల్లాసమై
ఉయ్యాలూగే ప్రాణం
నీ కలయికతో కథే
తారు మారే బంగారం
నీ ఇంటి దారేదని
చుట్టేసా భూగోళం
ఏ అల్లరి నవ్వులు వినిపిస్తున్నా
నువ్వేనంటున్నా
ఎదురయ్యే అందాలన్నింటిలోనూ
నిన్నే చూస్తున్నా
నింగిలోని వాన విల్లై
అంతలోనే మాయమయ్యావే
కానరాని కాంతి నువ్వై
ఎన్నాళ్లిలా తిప్పిస్తుంటావే….
హే మాయా సుందరి
హే మాయా సుందరి
హే మాయా సుందరి
హే మాయా సుందరి
నా మాయా సుందరి
నా మాయా సుందరి
ఎక్కడున్నావో మరి
ఎక్కడున్నావో మరి
ఏ సుముహుర్తాలలో
వచ్చావో నువ్విల్లా
ఆలోచనంతా నువై
అల్లాడానే పిల్లా
నీ గల గల పలుకులే
గుర్తొస్తున్నాయే చాలా
ఓ సారి ఈవైపోచ్చి ఉండిపోతే పోలా
కనుపాపలు గప్పి
దాగుడు మూతలు ఆడిస్తున్నావే
నిన్నిప్పటికిప్పడు చూడాలని
అనిపిస్తున్నావే
చల్లగాలి తెమ్మెరెలా
చెమ్మ మీటి మాయమయ్యావే
కన్ను కోరే వెన్నెలగా
ఏ రోజిలా దూసుకు వస్తావే…
హే మాయా సుందరి
హే మాయా సుందరి
హే మాయా సుందరి
హే మాయా సుందరి
నా మాయా సుందరి
నా మాయా సుందరి
ఎక్కడున్నావో మరి
ఎక్కడున్నావో మరి
Song Credits:
పాట: మాయ సుందరి (Maya Sundari)
సినిమా పేరు: “ధూమ్ ధామ్” (Dhoom Dhaam)
సంగీతం: గోపీ సుందర్ (Gopi Sundar)
సాహిత్యం: “సరస్వతి పుత్ర” రామజోగయ్య శాస్త్రి (Saraswathi Putra Ramajogayya Sastry)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
నిర్మాత: M.S. రామ్ కుమార్ (M.S. Ram Kumar)
దర్శకుడు: మచ్చ సాయికిషోర్ (Macha Saikishor)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.