Home » ధరణి మురిసే (Dharani Murise) సాంగ్ లిరిక్స్ – Love Failure Song

ధరణి మురిసే (Dharani Murise) సాంగ్ లిరిక్స్ – Love Failure Song

by Lakshmi Guradasi
0 comments

ధరణి మురిసే తన జన్మ ధాన్యమంటూ
నీ పాదాల పావనము తాకే
పసుపు కడలి ముద్దడి మురిసెనే
ఆగమంగమున అంచున తాకి
గగన మేఘాలే గంతులేసేనే
నీ నాట్యమున నైనాలు చూసి

గాలి పరవశమై పరితపించెనే
నీ కురుల హరివిల్లును తాకి
నిలువుటద్దమై నిప్పు నిన్ను చూపేనే
పసిడి వన్నె లాంటి నీ సౌందర్యాన్ని
పంచ భూతాలే నన్ను పరీక్షించెనే
నిన్ను చేరుకునే నా పయణాన్ని
నిన్ను చేరుకునే నా పయణాన్ని

జానకి రాముల ఆ స్వయంవారమున
రాముడు గెలిచి సీతమ్మను ఏలే
రావణ ఏలుపట్టి ప్రేమనుకోలేదే
ఇంతటి గోరము కలగానలేదే

అతడు: మామిడాకు తోరణాలే సిద్ధమాయన నీ పెళ్ళికే
సిద్ధమాయన నీ పెళ్ళికే
కాళ్ళకింద పారనే సాగనంపుతున్నదా అత్తింటికే
సాగనంపుతున్నదా అత్తింటికే

చెంపకున్న సోట్టబుగ్గాకే
అందంగా చుక్కనే పెట్టుకుంటివి
కంటికంట కుండా కంటిరెప్పకే
కాటుకను అందంగా దిద్దుకుంటివి
ఆ చుక్క చెప్పలేదా నీకు నాకు మధ్య
దాగి ఉన్న ప్రేమని
ఆ రెప్ప చెప్పలేదా చేయిఅడ్డుపెట్టిన
జారుతున్న కన్నీళ్లకి

మన జంట బాగుందంటూ
ఊరంతా అంటుంటే నేనెంతో సంబరపడితినే
నా ఊపిరాగినంక పోరాదే

నీ తాళిబొట్టె నన్ను చంపబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నా చావు మట్టే అక్షింతలు
నీ పెళ్ళికి అక్షింతలు
నీ ముందు మంటే నన్ను కాల్చబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నా చావు మాట్టే అక్షింతలు
నీ పెళ్ళికి అక్షింతలు

నీ తాళిబొట్టె నన్ను చంపబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నీ ముందు మంటే నన్ను కాల్చబట్టే
నా చావు మట్టే అక్షింతలు

నా రాత రాసిన ఆ బ్రహ్మ కూడా
రాయోలే మారేడ మన జంట చూడ
నా కంట మిగిలించే కన్నీళ్ల ధార
విడగొట్టి చూపించే చావంచు ద్వారా

అడుగుల్లో అడుగేసి ఏడు అడుగులేసి
అడవుల్లో నాకంటూ ఆరు అడుగులిచ్చి
అందగా నీ పాణిగ్రహణాన్ని జేసి
బంధంగా అయిపోయి మునివేళ్ళు పట్టి

నింగిలో ఉన్న చందమామ లెక్క
నవ్వుకుంటూ మంచిగున్నావే
చీకటున్న ఈ కన్నీటి సంద్రంలా
నన్ను ముంచి నువ్వు పోతివే

ఆ సీత రాములల్లే మనముంటామనుకుంటే
ఇంకో ఎలే నువ్వు పడితివే
నా చితికి మంట పెట్టి పోవే

నీ తాళిబొట్టె నన్ను చంపబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నా చావు మట్టే అక్షింతలు
నీ పెళ్ళికి అక్షింతలు
నీ ముందు మంటే నన్ను కాల్చబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నా చావు మాట్టే అక్షింతలు
నీ పెళ్ళికి అక్షింతలు

నీ తాళిబొట్టె నన్ను చంపబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నీ ముందు మంటే నన్ను కాల్చబట్టే
నా చావు మట్టే అక్షింతలు

ఇంకో చెయ్యి పెట్టె నీ కాళీ మెట్టే
ఎదురు చూడ బట్టే
నా చావు మట్టే
పసుపు చందనాలే నీ మోము కంటే
గుండె ఆగుతుందే నువ్వట్టా ఉంటె

మరు జన్మ నీతోనే తోడుంటా అంటూ
పాపిట్లో సిద్దురం పెట్టుకుంటివే
పాపిష్టి నీ ప్రేమ ప్రాణాలే తీస్తుంటే
పందిట్లో నీ నవ్వు నే పంచుకున్నవే

తాళి బొట్టు నీ ఎద మీద పడగా
జారీ చూడు అక్షింతలే
నేను పెట్టుకున్న ఆశలన్నీ
బూడిద అయినాయే ఇటు చూడవే
ప్రేమ లేని చోట పెళ్లి ఎట్టా
జరిగి అయ్యానంటా అది నరకమే
నేను ఇంకో జన్ముంటే తిరిగొస్తానే

నీ తాళిబొట్టె నన్ను చంపబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నా చావు మట్టే అక్షింతలు
నీ పెళ్ళికి అక్షింతలు
నీ ముందు మంటే నన్ను కాల్చబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నా చావు మాట్టే అక్షింతలు
నీ పెళ్ళికి అక్షింతలు

నీ తాళిబొట్టె నన్ను చంపబట్టే
నా చావు మట్టే అక్షింతలు
నీ ముందు మంటే నన్ను కాల్చబట్టే
నా చావు మట్టే అక్షింతలు

__________________________________

పాట: ధరణి మురిసే (Dharani Murise)
సాహిత్యం: MN నాని (MN Nani)
సింగర్: అంజి పమిడి (Anji Pamidi) & వాగ్దేవి (బేబీ టీమ్) (Vagdevi)
సంగీతం: అంజి పమిడి (Anji Pamidi)
తారాగణం : నీతు క్వీన్ (Neethu Queen), పుల్లా నాగరాజు (Pulla Nagaraju) , కిట్టు (Kittu), శ్యామ్ (Shyam), సందీప్ (Sandeep), లోకేష్ (Lokesh), వీర (Veera),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .

You may also like

Leave a Comment