నా అడుగులో అడుగు వేయవే ఓ పరనిక
వందేళ్లు ఉంటా నీతో చెయ్యి వీడక
ప్రతి జన్మలో నీకై పుడతా నీ తోడుగా
బావ నీలో సగమౌతా నీ నీడగా
నా అడుగులో అడుగు వేయవే ఓ పరనిక
వందేళ్లు ఉంటా నీతో చెయ్యి వీడక
ప్రతి జన్మలో నీకై పుడతా నీ తోడుగా
బావ నీలో సగమౌతా నీ నీడగా
శివ ధనుసునే విరిచి శ్రీ రాముడిలా
నీ స్వయంవరం నే గెలిచి నిను జేయించనా
ఏ కష్టం సుఖమున్న సీతమ్మలా
నీతో వనవాసమైన వచ్చి తోడుండనా
ఆ రాముడు సీతమ్మలా వెయ్యేళ్లకు
మనజంటే ఆదర్శమై నిలవాలిక
ప్రతి ఏడు ఒక పండుగల ఈ రోజునే
వేడుకగా జరపాలంట నూరేళ్ళకు
నా అడుగులో అడుగు వేయవే ఓ పరనిక
వందేళ్లు ఉంటా నీతో చెయ్యి వీడక
ప్రతి జన్మలో నీకై పుడతా నీ తోడుగా
బావ నీలో సగమౌతా నీ నీడగా
నువ్ నడిచే దారుల్లో ముల్లెన్నున్నా
నీ పాదాలు కందకుండా పూవై పుడతా
నా గుండె కోవెలలో దైవం చేసి
నిన్ను జన్మంతా పూజించి దాసిని అవుతా
నా ఆరో ప్రాణం నువ్వే ఓ పరనిక
కడదాకా సర్వం నువ్వే కదానికిక
ఓ బావ నువ్వే ఇంకా నా ధైర్యము
కలకాలం నను కాపాడే నా సైన్యము
నా అడుగులో అడుగు వేయవే ఓ పరనిక
వందేళ్లు ఉంటా నీతో చెయ్యి వీడక
ప్రతి జన్మలో నీకై పుడతా నీ తోడుగా
బావ నీలో సగమౌతా నీ నీడగా
ప్రతి క్షణం నా మనసు నీ చుట్టూరా తిరిగి
నా ఊపిరి బరువెక్కి నిన్ను అడిగేనే
చావైనా బ్రతుకైనా నీతో అంటూ
ఇంకా నా ప్రాణం నీ ఊపిరికే బదులిచ్చే
నాతో నువ్వు కలిసుండగా ఏ మరణము
నీతో నను విడదీయదులే ఓ పరనిక
ఓ బావ నువ్వు తోడుంటే ఓ స్వర్గము
నువ్వు లేని నిమిషము నాకు ఓ నరకము
నా అడుగులో అడుగు వేయవే ఓ పరనిక
ప్రతి జన్మలో నీకై పుడతా నీ తోడుగా
నా అడుగులో అడుగు వేయవే ఓ పరనిక
బావ నీలో సగమౌతా నీ నీడగా…
__________________________
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
సాహిత్యం: సింధూరం రమేష్ (Sindhuram Ramesh)
గాయకులు : చిటపట కర్ణాకర్( Chitapata Karnakar) & సోను సింగ్ (Sonu Singh)
దర్శకత్వం: శివ వేలుపుల (Shiva Velupula)
నిర్మాత: నవీన్ కొండ్రా (Naveen Kondra)
నటీనటులు : హనీ హర్ష (Honey Harsha) & కార్తీక్ రెడ్డి (Karthik Reddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.