గుప్పెడంత ఉప్పుతో
అంటుకున్న నిప్పుతో
దండి యాత్ర చేసే గాంధీ
చిన్న చెరుకు ముక్కతో
తీయ్యనైనా లెక్కతో
మొండి యాత్ర షురువయింది
బక్క పలస ఒంటితో
ఉక్కు లాంటి గుండెతో
ఒక్కడొచ్చే నాడు గాంధీ
చిక్కు విప్పే ఆశతో
మొక్కవోని దీక్షతో
చిరుత పిల్ల ఇక్కడుంది
ఈ చెట్టు దీని సుట్టం అంది
సుట్టేసి కొమ్మ కొమ్మ
ఊరంతా కట్టమొస్తే రంధి
పట్టు పట్టింది పెంకి పిల్ల
పల్లేరు కాయలున్న దారి
దుంకు దుంకింది కోరి కోరి
ఈ పిల్ల బాటలోన జేరి
ఊరే నడిచింది..
ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
అరె హేయ్ ఈ పిల్ల ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
ధగ ధగడ్
హేయ్ ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
అరె హేయ్ ఈ పిల్ల ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
ధగ ధగడ్ హ!
టిక్క టిక్క టిక్కటి
బుర్రుపిట్ట ఒక్కటి
తుర్రుమంటూ ఎగిరేనంటా
ఒక్కటొక్కటొక్కటి తోక పట్టి ఎంకటి
సిలకలొచ్చి వాలేనంట
డింక టిక్క టిక్కటి
వాన సినుకు ఒకటి
సర్రుమంటూ దుంకేనంట
దులిపినట్టు దుప్పటి
మబ్బులన్నీ తియ్యటి
తేనెజల్లు కురిసేనంట
తోటోళ్ళు పాట పాడుతుంటే
సప్పట్ల ఆటలాడుతుంటే
ఈ పిల్ల పాట్లు సూడబట్టే
ఈ ఆటుపోట్లు ఎట్లా పోవునంటూ
ఆ చిట్టి బుర్ర సానబెట్టే
తిప్పల్ని బాగా సదువబట్టే
సొంతంగా కొత్త జట్టు కట్టే
తుప్పలన్నీ కదులబట్టేరా
నమ్మకాన్నీ ఇత్తు జేసి పాతింది
చెమట చుక్కలన్నీ పోసి సాదింది
కండ్ల నిండ్ల ఒత్తులేసి సూసింది
పూత పూసి కాత కాసి నీడనిచ్చే రోజు కోసం
సాటుంగా నవ్వుకున్నా ఏదున్నా
సూటింగా పోయేరన్నా రాళ్ళున్నా
ఈటల్లే గుచ్చుతున్న మాటల్నే
దులుపుకుంది దుమ్ములేక్కన
ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
అరె హేయ్ ఈ పిల్ల ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
ధగ ధగడ్
హేయ్ ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
అరె హేయ్ ఈ పిల్ల ధగడ్
హేయ్ ఈ పిల్ల ధగడ్
ధగ ధగడ్ హ!
______________________
సాంగ్ : ధగడ్ పిల్ల (Dhagad Pilla)
ఆల్బమ్/సినిమా: గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu)
నటులు: సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi), ఆనంద చక్రపాణి (Ananda Chakrapani), రాగ్ మయూర్ (Rag Mayur), భానుప్రకాష్ (Bhanuprakash)
సంగీతం: రీ (Ree)
గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)
లిరిక్స్ : కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
రచన & దర్శకత్వం: పద్మావతి మల్లాది (Padmavathi Malladi)
సమర్పకులు: తబిత సుకుమార్ (Thabitha Sukumar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.