దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన
కడదాకా సాగనా..
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నా కోసం
ఎవరేమి అనుకున్నా..
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ
ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
నేనంటూ ఉంటానా..
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన
కడదాకా సాగనా..
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
___________________________
సాంగ్ : దేవుడు కరుణిస్తాడని (Devudu karunisthadani )
చిత్రం : ప్రేమ కథ (Prema Katha)
గాయకులు: రాజేష్ (Rajesh), అనురాధ శ్రీ రామ్ (Anuradha Sri Ram)
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry)
సంగీతం: సందీప్ చౌతా (Sandeep Chowta)
నటీనటులు : సుమంత్ (Sumanth), అంతర మాలి( Antara Mali),
దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)
నిర్మాత: నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.