Home » దేవత ఓ దేవత – పోటుగాడు

దేవత ఓ దేవత – పోటుగాడు

by Rahila SK
0 comments

పాట: దేవతా ఓ దేవతా
చిత్రం : పోటుగాడు (2013)
దర్శకుడు: పవన్ వాడయార్
సంగీతం: చక్రి, అచ్చు రాజమణి
నటీనటులు : మంచు మనోజ్ కుమార్, సాక్షి చౌదరి, అను ప్రియ


ఇదివరకిటు వైపుగా… రాలేదుగా నా కల
చేజారినదేమిటితో… తెలిసిందిగా ఈ వేళ
చిమ్మ చీకటి నిన్నలో… దాగింది నా వెన్నెల
మరుజన్మము పొందేలా… సరి కొత్తగా పుట్టానే మరలా

దేవత ఓ దేవత… నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో… నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత… నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో… నను మనిషిగా మలిచావే

ఓఓ ఓ ఓ ఓ………..

నా గుండె కదలికలో… వినిపించే స్వరము నువ్వే
నే వేసే అడుగు నువ్వే… నడిపించే వెలుగే నువ్వే
నా నిన్నలనే మరిపించేలా… మాయేదో చేసావే
అనురాగపు తీపిని నాకు…. రుచి చూపించావే అమ్మల్లే

దేవత ఓ దేవత… నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో… నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత… నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో… నను మనిషిగా మలిచావే

ఓఓ ఓ ఓ ఓ………..

నీవల్లే కరిగిందే… మనసంతా కను తడిగా
నిజమేదో తెలిసేలా… నలుపంతా చెరిగెనుగా
గత జన్మల రుణ బంధముగా… కలిసావే చెలి తీగ
ఇకపై నేనెప్పటికీ… నీ ఊపిరిగాలల్లే ఉంటాగా

దేవత ఓ దేవత… నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో… నను మనిషిగా మలిచావే
దేవత ఓ దేవత… నా మనసునే మార్చావే
ప్రేమతో, నీ ప్రేమతో… నను మనిషిగా మలిచావే.. ..

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment