దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నిను నే రేప్పనై
నా జత నీవే ఇక నా కత నీవే
ఎడ బాయక ఉంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కధ..
దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నిను నే రేప్పనై
చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను
ఉలిలా నను తాకవో శిల్పనవుతాను
నీ ఊపిరితో ఈ వెదురైనా వేణువుకాగా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాగా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగనా
నీవే నేనై బతకనా తలపుల తలపులు తెరిచిన చెలీ
జోరున కురిసే వానల్లో ఎండే నువ్వంట
దిక్కులు చెరిగే ఎండల్లో వానే నువ్వంట
ఏకాంతాన్ని వెలివేసే తోడే నువ్వంట
శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట
నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపము గుండెల వెలిగే దీపము
పంచే తీయని తాపము వలపుల పిలుపులు తెలిపిన మది
దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నిను నే రేప్పనై
నా జత నీవే ఇక నా కత నీవే
ఎడ బాయక ఉంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కధ..
————————-
నటీనటులు: విశాల్, ప్రియమణి
సంగీతం: మణి శర్మ
సాహిత్యం; వెన్నెలకంటి
గాయకులు: దీపు
నిర్మాత: జి.విక్రమ్ కృష్ణ
దర్శకుడు: జి.భూపతి పాండ్యన్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.