మహా అద్భుతం కదా…అదే జీవితం కదా..
చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే
అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే
నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే
అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే..
ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే
ప్రతీరోజు రాదా వాసంతం..
ఆనందాల చడి చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కే పెడితే లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులు..
చుట్టూ లేవా ఎన్నో రంగులు..
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే
ఓ కాలమే నేస్తమై నయం చేస్తుందే
గాయాల గతాన్ని..
ఓహో..ఓహో..ఓహో..ఓహో
అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి
సంతోషాల తీరం పోదాం భయం దేనికి
పడుతూ లేచే అలలే కాదా నీకే ఆదర్శం
ఉరుమో మెరుపో ఎదురేపడనీ
పరుగాపకు నీ పయనం…
తీపి కావాలంటే చేదు మింగాలంతే..
కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా ..
కళ్ళే తడవని విషాదాలని..
కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనయినా చూసేటందుకు వీలుంటుందా
చుట్టంచూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనయినా చూసేటందుకు వీలుంటుందా
చుట్టంచూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనయినా చూసేటందుకు వీలుంటుందా
చుట్టంచూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఉందాం ఒకరికి ఒకరుగా
_____________________________
పాట పేరు: మహా అద్భుతం
సినిమా పేరు: “ఓ బేబీ” (“Oh Baby”)
దర్శకురాలు: బి.వి. నందిని రెడ్డి (B. V. Nandini Reddy)
నటీనటులు : సమంత అక్కినేని (Samantha Akkineni), తేజ సజ్జా ( Teja Sajja) తదితరులు.
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
గాయకులు: నూతన మోహన్ (Nutana Mohan)
సాహిత్యం: భాస్కరభట్ల (Bhaskarabhatla)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.