చూసాను మనసుతో నిన్నే… ఏ కన్ను చూడని ముఖమే
ఓ రాయి నువ్వని తలచీ… నీవెవ్వరని నిన్నే అడిగా, అది నీవా
ఇచట కలవే… అయినా కలవే
ప్రతిచోట వెతికి నిను… నాలో కలిసా
ఇది చాలు నాకు… వేరే వరములు ఇంకా ఎందుకు
దేవా మదిని కొలువ…
కలిశా నిన్నే నిన్నే… మరిచా నన్నే నన్నే
చూసాను మనసుతో నిన్నే… ఏ కన్ను చూడని ముఖమే
ఓ రాయి నువ్వని తలచీ… నీవెవ్వరని నిన్నే అడిగా, అది నీవా
వేదాలే ఘోశిస్తుంటే… యాగాలే నిత్యం చేస్తూ
పూజించే భక్తి ఎంతో… చూస్తున్నావుగా
ఆకలితో చెయ్యే చాచి వస్తే… తన చేతుల్లోని ఆహారం
పంచె చేయి చూస్తున్నావుగా…
నిను చూడ జనమంతా… జగమంతా తిరుగుతారే
సులభంగా నిను చేరే… దారెవరు తెలుసుకోరే
అలంకారమసలు లేని… అహంకారమన్నది లేని
ఏ కల్లకపటం కానరాని మనసుల్లో నువ్వే
కలిశా నిన్నే నిన్నే… మరిచా నన్నే నన్నే
మదిలో మహిలో… అణువణువు సకల సృష్టిలో
చీమ హృదయ లయవే… ఏనుగు మొండెము బరువువే
నీ వేయి చేతుల్లోని… ఒక చేయి నాకివ్వలేవా
నీ వేయి కన్నుల్లోని… ఒక జత నాకివ్వలేవా
నాకున్నది ఇక నీ శరనాగతియే…
చూసాను మనసుతో నిన్నే… ఏ కన్ను చూడని ముఖమే
ఓ రాయి నువ్వని తలచీ… నీవెవ్వరని నిన్నే అడిగా, అది నీవా
___________
పాట: చూసాను (Choosanu (Ammoru Song))
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్ (Girishh Gopalakrishnan)
గాయకుడు – జైరామ్ బాలసుబ్రమణియన్ (Jairam Balasubramanian)
సాహిత్యం – రెహమాన్ (Rahman)
నటీనటులు: నయనతార (Nayanthara,), ఆర్జే బాలాజీ (RJ Balaji),
రచన & దర్శకత్వం : RJ బాలాజీ (RJ Balaji) & NJ శరవణన్ (NJ Saravanan)
నిర్మాత – డా.ఈశారి (Dr.Ishari) కె. గణేష్ (K. Ganesh)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
