చూడొద్దే నను చూడొద్దే
చురకత్తిలాగ నను చూడొద్దె
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దె
మది గూడు దాటి వదిలెళ్ళొద్దె
అప్పుడు పంచిన నీ మనసె అప్పని అనవద్దె
ఇప్పుడు పెరిగిన వడ్డీతొ ఇమ్మని అడగొద్దే
చూడొద్దే నను చూడొద్దే
చురకత్తిలాగ నను చూడొద్దె
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దె
మది గూడు దాటి వదిలెళ్ళొద్దె
వద్దు వద్దంటు నేనున్న వయసె గిల్లింది నువ్వేగ
పోపో పొమ్మంటు నేనున్న పొగల అల్లింది నువ్వేగ
నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగ
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతొ నడిచె నా నీడ నీతొ నడిపావె
నాలొ నిలిచె నా ప్రాణం నువ్వై నిలిచావే
చూడొద్దే నను చూడొద్దే
చురకత్తిలాగ నను చూడొద్దె
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దె
మది గూడు దాటి వదిలెళ్ళొద్దె
వద్దు వద్దంటు నువ్వున్న వలపె పుట్టింది నీ పైన
కాదు కాదంటు నువ్వున్న కడలె పొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలొ పడవల్లె నిలిచున్న
సుడిగుండాల శృతిలయలొ పిలుపె ఇస్తున్న
మంటలు తగిలిన పుత్తడిలొ మెరుపె కలుగునులె
ఒంటిగ తిరిగిన ఇద్దరిలొ ప్రేమె పెరుగునులే
చూడొద్దు నను చూడొద్దు
చురకత్తి లాగా నను చూడొద్దు
వెళ్లొద్దు వదిలెళ్లొద్దు మది గూడు దాటి వదిలెల్లోద్దు
అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీ పేరే
__________________
సాంగ్ : చూడొద్దే నను చూడొద్దే ( Chudodde Nanu Chudodde)
చిత్రం: ఆరు (Aaru)
నటీనటులు: సూర్య (Surya), త్రిష (Trisha)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సాహిత్యం –చంద్ర బోస్ (Chandra bose)
గాయకులు: టిప్పు (Tippu), సుమంగళి (sumangali)
నిర్మాత: శరణ్ (Saran)
దర్శకుడు: హరి (Hari)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.