చూడకయ్యో నెమలికల్లా
తూగుతున్న తూనీగల్లా
ఉన్నావమ్మా ఎల్లోరాల
తేలుతున్న తరలల్లా
తోచకుంది తోకబీళ్ల
తోయమాకు లోయలల్లా
కులుకులన్నీ కాశ్మీరాళ్ల
కేకలోదే కాష్మోరాల
చూడకయ్యో నెమలికల్లా
తూగుతున్న తూనీగల్లా
ఉన్నావమ్మా ఎల్లోరాల
తేలుతున్న తరలల్లా
మోటబావి గిరాకల్లే నువ్వు
తిరుగుతుంటే నాకొచ్చే నవ్వు
సిగ్గు పువ్వు పూసినట్టుంది
తాటాకు గుడిసెల్లో నువ్వు
మిణుగురు వెలుగులు రువ్వి
ప్రేమదారి చూపినట్టుందే
సూరీడే సురెక్కినట్టుంది
తాకాలని తారాడినట్టుంది
గోదారి ఒనేసినటుందే
కులుకులన్నీ సిలికినట్టుందే
చూడకయ్యో నెమలికల్లా
తూగుతున్న తూనీగల్లా
ఉన్నావమ్మా ఎల్లోరాల
తేలుతున్న తరలల్లా
పచ్చగడ్డి పరుపేసినట్టు
పరువమంతా పోగేసినట్టు
పస్తు తీరి పోతున్నట్టుందే
ప్రేమధార పోసినట్టు
పెదవి దోసిలొగ్గినట్టు
వయసు దాహం తీరినట్టుంది
కాలాలన్నీ కలిసొచ్చినట్టుందే
కలలన్ని తీరినట్టుందే
దూరాలన్నీ చెరిగినట్టుంది
బరువు తేలికైనట్టుంది
చూడకయ్యో నెమలికల్లా
తూగుతున్న తూనీగల్లా
ఉన్నావమ్మా ఎల్లోరాల
తేలుతున్న తరలల్లా
___________________________________
పాట శీర్షిక : చూడకయ్యో నెమలికల్లా (Choodakayyo Nemalikalla )
గానం – సాయి చరణ్ (Sai Charan), సునీత (Sunita)
సంగీతం: మార్కండేయ (Markandeya)
సాహిత్యం – మరకండేయ (Marakndeya)
నిర్మాత: లింగయ్య పరమళ్ల (Lingaiah Paramalla)
దర్శకుడు: పిఎల్ విఘ్నేష్ (P L Vignesh)
నటీనటులు : సదన్ (Sadan), ప్రియాంక ప్రసాద్ (priyanka prasad) , సాయికుమార్ (Saikumar), పృద్వి 30 ఏళ్లు (prudvi 30yrs), జబ్బర్దస్త్ రాజమౌళి (Jabbardasth Rajamouli)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.