చిన్నఇది వింత లోకం
ఎం చేసిన నేరమే
ఓ…..
చిన్నఇది వింత లోకం
ఎం చేసిన నేరమే
కన్న ఇది ఇంద్రజాలం
అంతా ఇరకాటమే
చెప్పింది వింటే కొడతారు చప్పట్లే
ఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లే
చెప్పింది వింటే కొడతారు చప్పట్లే
ఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లే
ప్రశ్నించుకుంటే ఏమి రాదంటుంది
ప్రశ్నించమంటే చాల్లే పోమంటుంది
అర్ధంకాక ఉంటే ఎగతాళి చేస్తుంది
అర్ధం లేకున్నా అటు వైపే తోస్తుంది
పనికొచ్చేవన్నీ తనకొద్దులే
తనకున్నవన్నీ సరిహద్దులే
చెప్పింది వింటే కొడతారు చప్పట్లే
ఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లే
హూ చుక్కాని లేని చుక్కల్ని చూడు
లెక్కల్ని వల్లే వేసాయా ?
చక్కంగా ఆడు చిట్టి గిజిగాడు
ఎక్కాలె నేర్చుకున్నాడా ?
అర్ధంకాని పాటలన్ని
బెత్తంతో స్నేహం చేస్తే వస్తాయా ?
పొట్టి అంటూ ప్రాణం తీసే తలకుమలినా బరువులే
కదలమని పోరే వారే బదులు విన్నారే
కలలు నెరవేరే తీరం
చాల దూరం దారే
చెప్పింది వింటే కొడతారు చప్పట్లే
ఇబ్బంది అంటే పెడతారు ఇక్కట్లే
ఓ…..
చిన్నఇది వింత లోకం
ఎం చేసిన నేరమే
కన్న ఇది ఇంద్రజాలం
అంతా ఇరకాటమే
అయినా మీ వంటి వారే మింటినే అంటుంటారే
మారిపోకుంటే తీరే ఏమొచ్చినా లోకం ఎదురొచ్చిన
_________________________________________________________
పాట పేరు – చిన్న ఇది వింత లోకం (Chinna Idi Vintha Lokam)
చిత్రం : 35 – చిన్న కథ కాదు (35 – Chinna Katha Kaadu)
గీత రచయిత – భరద్వాజ్ గాలి (Bharadwaj Gali)
గాయకుడు – విజయ్ ప్రకాష్ (Vijay Prakash)
సంగీతం సమకూర్చారు: వివేక్ సాగర్ (Vivek Sagar)
రచయిత మరియు దర్శకుడు: నంద కిషోర్ ఈమాని (Nanda Kishore Emani)
సమర్పకుడు: రానా దగ్గుబాటి (Rana Daggubati)
నిర్మాతలు: సృజన్ యరబోలు (Srujan Yarabolu), సిద్ధార్థ్ రాళ్లపల్లి (Siddharth Rallapalli)
తారాగణం : నివేదా థామస్ (Nivetha Thomas), ప్రియదర్శి (Priyadarshi), విశ్వదేవ్ రాచకొండ (Vishwadev Rachakonda), మరియు తదితరులు
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.