Home » చెప్పవే చిరుగాలి – ఒక్కడు

చెప్పవే చిరుగాలి – ఒక్కడు

by Firdous SK
0 comments
cheppave chirugali song  lyrics okkadu

పాట: చెప్పవే చిరుగాలి
సినిమా: ఒక్కడు
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: ఉదిత్ నారాయణ్, సుజాత


చెప్పవే చిరుగాలి
చల్లగా ఎద గిల్లి

చెప్పవే చిరుగాలి
చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి
ఓ చూపవే నీతో తీసుకెళ్లి
ఎక్కడే వసంతాల కేళి
చూపవే నీతో తీసుకెళ్లి

చెప్పవే చిరుగాలి
చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి
ఓ చూపవే నీతో తీసుకెళ్లి
ఎక్కడే వసంతాల కేళి
ఓ చూపవే నీతో తీసుకెళ్లి

ఆశ దీపికలై మెరిసే తారకలు
చూస్తే తీపి కలై విరిసే కోరికలు

మనతో జత సాగుతుంటే
హో అడుగే అలై పొంగుతుంది

ఆ చుట్టూ ఇంకా రేయున్నా
అంతా కాంతే చూస్తున్నా

ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటె
ఆపగలవ చీకట్లు

కురిసే సుగంధాల హోలీ
ఓ చూపదా వసంతాల కేళి
కురిసే సుగంధాల హోలీ
ఓ చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి
చల్లగా ఎద గిల్లి

యమునా తీరాల కథ వినిపించేలా
రాధామాధవుల జత కనిపించేలా

పాడనీ వెన్నెల్లో ఈ వేళా
చెవిలో సన్నాయి రాగంలా

ఓ కలలే నిజమై అందేలా
ఊగే ఊహల ఉయ్యాల

లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి యేటిని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా
పొద్దే పలకరించాలి

ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ
హో చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ
హో చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి
చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి
ఓ చూపవే నీతో తీసుకెళ్లి
ఎక్కడే వసంతాల కేళి
ఓ చూపవే నీతో తీసుకెళ్లి

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.