Home » వానాకాలంలో జామకాయను తినవచ్చా?

వానాకాలంలో జామకాయను తినవచ్చా?

by Shalini D
0 comment

జామ పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వానాకాలంలో జామకాయను తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది.  జామపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహులు జామపండును తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది.

జామపండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. జామపండు ఒక పండు మాత్రమే కాదు దాని ఆకులు కూడా శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

విటమిన్స్ పుష్కలంగా ఉండే జామపండు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి3, విటమిన్ బి6 మెదడులో రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జామకాయ వర్షాకాలంలో కూడా అధికంగా లభిస్తుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఇది పోషకాల భాండాగారం. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్ శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. మలబద్ధకం సమస్యకు జామపండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment