మన శరీరం లో ఎముకలు ప్రతిష్టాంగా ఉండాలి అంటే కాల్షియమ్ ఎంతో అవసరం. నేటి కాలం మనుషులలో ఎముకల నొప్పులు అవి చిన్న వయసులోనే వస్తున్నాయి. దానికి ముఖ్య కారణం కాల్షియమ్ తక్కువగా ఉండడం వలనే అని మనం చెప్పవచ్చు. మారుతున్న ఆహార పద్ధతుల కారణంగా శరీరానికి సరైన పోషకాలు అందడం లేదు. దాని వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు మనకు తలెత్తుతాయి. మన శరీరం దృడంగా ఉండాలి అంటే కాల్షియమ్ ఎంతో అవసరం అలనాటి కాల్షియమ్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏంటో చూసేదం రండి.
కాల్షియమ్ ని మన శరీరం ఎలా తీసుకుంటుంది:
మనలో చాల మంది శరీరానికి సరిపడే కాల్షియమ్ ను అందించడానికి కాల్షియమ్ టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు. కానీ అయినా కూడా వాళ్ళకి కాల్షియమ్ కొరత అనేది శరీరం లో ఉంటుంది. దీనికి కారణం కాల్షియమ్ టాబ్లెట్స్ ను వేసుకొనే తప్పుడు మనం నీటితో కలిపి వేసుకుంటూ ఉంటాము. ఆలా చేస్తే కాల్షియమ్ మన శరీరం అబ్సర్బ్ చేసుకోలేదు. కాల్షియమ్ మన శరీరానికి బాగా అందలి అంటే కొవ్వు పదార్థాలతో కలిపి తీసుకోవాలి. అప్పుడు కాల్షియమ్ మన శరీరంలోకి బాగా అందుతుంది.
కాల్షియమ్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఏమైనా చెప్పమంటే మన అందరికి టక్కున గుర్తు వచ్చే అహ్హరం పాలు. మనందరం పాలల్లో ఎక్కువ కాల్షియమ్ ఉంది అని అనుకుంటాము కానీ పాల కన్నా కాల్షియమ్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు చాల ఉన్నాయి అవి ఏంటో ఇక్కడ చూద్దాం రండి.
కాల్షియమ్ అధికంగా ఉండే ఆహారాలు:
- రాజ్ గిరా గింజలు లేదా పిండి:
కాల్షియమ్ అధికంగా ఉండే ఆహారాలలో మొదట వచ్చేది రాజ్ గిరా గింజలు. వీటినే మనము అమరనాథ్ పిండి అని కూడా పిలుస్తాము. 100 గ్రాముల రాజ్ గిరా లో 340mgల కాల్షియమ్ ఉంటుంది. దింట్లో కాల్షియమ్ ఒక్కటే కాకుండా 9 రకాల ఎమినో యాసిడ్లు అధికంగా ఉండే ఏకైక వెజిటేరియన్ ఆహరం రాజ్ గిరా గింజలు. రాజ్ గిరా లో కాల్షియమ్ ఒక్కటే కాకుండా ఐరన్, సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం కూడా బాగానే ఉంటాయి.
- రాగి:
మన ఆంధ్ర లో రాగి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన చాల మంది ముఖ్యంగా రాయలసీమ లో అయితే రాగి ని చాల బాగా తింటారు. రాగి జావా, రాగి సంగటి, రాగి రోటి ఇలా చాల రకాలుగా రాగి ని వాడుతూ ఉంటాము. 100 గ్రాముల రాగి లో 330mgల కాల్షియమ్ ఉంటుంది. రాగి లో కాల్షియమ్ ఒక్కటే కాకుండా హిమోగ్లోబిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం లో యెర్ర రక్త కణాలను పెంచుతుంది.
- ఉలవలు:
100 గ్రాముల ఉలవలలో 300mgల కాల్షియమ్ ఉంటుంది. ఉలవలను మనం ఎక్కువగా గుర్రాలకు ఆహారంగా పెడుతూ ఉంటాము. ఉలవలలో కాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు వీటిని ఒక 100 గ్రాములు తీసుకోవడం వలన మీ కావలసిన సరిపడా కాల్షియమ్ అందుతుంది. మీ ఎముకలు దృడంగా తయారు అవుతాయి. ఏ ఏ మిల్లెట్స్ లో ఎంత శాతం కాల్షియమ్ ఉందొ చూదాం రండి.
మిల్లెట్స్ (100గ్రా) | కాల్షియమ్ మోతాదు |
రాజ్మా | 270mg |
నల్ల సెనగలు | 220mg |
పొట్టు మినపప్పు | 140mg |
చెన్న | 130mg |
గోధుమలు | 34mg |
- నువ్వులు:
నువ్వులలో కాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కాల్షియమ్ ఒక్కటే కాకుండా మెగ్నీషియం, మాంగనీస్, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ నువ్వులతో బెల్లం కలిపి తింటే మీ ఎముకలు గట్టిగ ఉంటాయి. కానీ ఎండ కాలం లో నువ్వులను ఎక్కువగా తినకండి వేడి ఎక్కువ చేస్తుంది.
- సున్నం:
మన పేదలు తమలపాకులు వేసుకునేటప్పుడు వాడే సున్నం లో కాల్షియమ్ బాగా ఉంటుంది. ఒక చిన్న చెంచాడు సున్నం ను పెరుగు లో కలిపి తీసుకోవడం శరీరానికి కాల్షియమ్ బాగా అందుతుంది. కాల్షియమ్ మన బాడీ బాగా అబ్సర్బ్ చేసుకోవాలి అంటే దానిని కొన్ని ఫ్యాట్టి ఫుడ్స్ తో కలిపి తీసుకోవాలి లేదంటే మనం తీసుకున్న కాల్షియమ్ కిడ్నీ లో లేదా గాల్ బ్లాడ్డర్ లో రాళ్ళలా మారుతుంది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.