Bunny yadav | ఓ రామ సిలక (O Rama Silaka) folk lyrics

by Lakshmi Guradasi

గాలిలో తేలిపోతున్న నిన్ను చూడగానే
మబ్బుల్లో ఎగిరిపోతున్న నిన్ను కలువగానే

ఏ దేవుడు పంపిండో నిన్ను దండమెట్టుకోవాలే
నీతోనే నా రాత వందేళ్లు రాసి పెట్టుకున్నాలే
బంగారాన్ని తింటావా ఏందే ఇంత ముద్దుగా ఎట్ట పుట్టావే

ఓ రామ సిలక నన్ను కిందేసి పైనేసి తొక్కేసి సంపేయాకే..
నా రామ సిలక నీ సుపుల్తో నన్నిట్ఠా కట్టేసి ఎళ్ళిపోకే..
ఓ రామ సిలక నన్ను కిందేసి పైనేసి తొక్కేసి సంపేయాకే..
నా రామ సిలక నీ సుపుల్తో నన్నిట్ఠా కట్టేసి ఎళ్ళిపోకే..

వారం వారం గుడికే నే తిరుగుతున్నా
నిన్నే కలపమని దేవుడికే చెప్పుతున్నా
గారం గారాబంగా నిన్నే నే చూస్తూ ఉన్నా
నిన్నే కలకాలం అట్టానే చూసుకోవాలని

నీతో ఉంటె చాలే పిల్ల.. లోకాన్నే మరిసిపోతనే
నీతోనే మాట్లాడుతుంటే నాలోనే నేనుండనే
పడిపోయా నీకే నీ మైకంలో ఉండిపోయా

ఓ రామ సిలక నన్ను కిందేసి పైనేసి తొక్కేసి సంపేయాకే..
నా రామ సిలక నీ సుపుల్తో నన్నిట్ఠా కట్టేసి ఎళ్ళిపోకే..
ఓ రామ సిలక నన్ను కిందేసి పైనేసి తొక్కేసి సంపేయాకే..
నా రామ సిలక నీ సుపుల్తో నన్నిట్ఠా కట్టేసి ఎళ్ళిపోకే..

చిన్ని చిన్ని కోరికలెన్నో కలలోనే కంటూ ఉన్నా
బుజ్జి బుజ్జి నీ మనసుతో అన్నీ నువ్వే నెరవేర్చారాదే
గట్టి గట్టి గుండెటోన్నే నిన్నే చూసి పడిపోయానే
నీటిలోని ఉప్పులాగా నీ ప్రేమకే నే కరిగిపోయానే

అమ్మి అమ్మి అంటూ నిన్నే ముద్దుగా పిలుసుకుంటానే
నువ్వే అలిగి కూసుంటే పిల్ల నిన్నే నే బుజ్జగిస్తానే
కొట్టినా తిట్టినా నిన్నే నేను ఒదిలి పోనే

ఓ రామ సిలక.. ఈ పిల్లోడి బాధను కూసింత చూసి పోవే..
ఓ రామ సిలక.. ఈ చిన్నోడి చెంతకి నువ్వెళ్ళి చేరుకోవే..
ఓ రామ సిలక.. ఈ పిల్లోడు నీ కోసం పడిగాపు కాస్తున్నాడే..
ఓ రామ సిలక.. ఈ చిన్నోడ్ని నువ్వే వదిలేసి వెళ్ళిపోకే..

________________

Song Credits:

సాంగ్ : ఓ రామ సిలక (O Rama Silaka) folk
తారాగణం: బన్నీ యాదవ్ (Bunny yadav) & వైష్ణవి సోనీ (Vaishnavi Sony)
దర్శకత్వం & కొరియోగ్రఫీ: (Balu SM)
నిర్మాత: బన్నీ యాదవ్ (Bunny Yadav)
సాహిత్యం: సిద్దూ యాదవ్ (Siddu Yadav)
సంగీతం & గాయకుడు (పురుషుడు): నవీన్ జె (Naveen J)

See Also plz click on this: rendu-jadala-jamuna-song-lyrics-madhuri-rathod

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like