ఇటీవలి కాలంలో BSNL స్మార్ట్ఫోన్ గురించి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఈ పరికరంలో 200MP కెమెరా, 5G కనెక్టివిటీ, మరియు 5800mAh లేదా 7000mAh బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఉంటాయని వార్తలు వెలువడ్డాయి. కానీ BSNL ఈ వార్తలను ఖండించింది, వీటిని పూర్తిగా తప్పుడు సమాచారంగా పేర్కొంది.
BSNL అధికారిక ప్రకటన :
BSNL సంస్థ ఈ రకాల వదంతులు ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు అని వెల్లడించింది. తమ సంస్థకు ఇలాంటి స్మార్ట్ఫోన్ ప్రాజెక్టుపై ఎటువంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, మోసపోవద్దని హెచ్చరించింది.
నెట్వర్క్ విస్తరణపై BSNL దృష్టి :
ప్రస్తుతం BSNL కొత్త స్మార్ట్ఫోన్లు తయారు చేయడంపై కాకుండా 4G, 5G నెట్వర్క్ల విస్తరణపై దృష్టి సారిస్తోంది. 2025 నాటికి BSNL దేశవ్యాప్తంగా 100,000 టవర్లు ఏర్పాటు చేయనుంది, తద్వారా 5G సేవలు వేగంగా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రజలకున్న సూచన :
ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే ప్రయత్నాలను గుర్తించి, అధికారిక సమాచారం కోసం BSNL అధికారిక వెబ్సైట్ లేదా ధృవీకరించబడిన సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాల్సిందిగా సూచిస్తోంది.
ఈ వదంతులు అసత్యమని, BSNL స్మార్ట్ఫోన్లు రూపొందించడంలో ఆసక్తి చూపడంలేదని స్పష్టమైంది. కాబట్టి, ఇలాంటి వదంతులను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను చూడండి.