Home » అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్ (Ultrasonic Pest Repeller)

అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్ (Ultrasonic Pest Repeller)

by Rahila SK
0 comment
59

ప్రతి ఇంటిలో నూ చీమలు, దోమలు, ఈగలు, సాలెపురుగులు, బొద్ధింకాలు, చెదపురుగులు వంటి కీటకాలతో ఇబ్బందులు తప్పవు. వాటికీ తోడు బల్లులు, ఎలుకలు వంటివి ఇంటి వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. చీమలు, దోమలు, బొద్దింకలు, చెదపురుగులను నిర్మూలించడానికి రసాయనాలతో కూడిన రకరకాల మందులు వాడుతుంటాం. ఈ మందులు మనుషులకూ హని చేస్తాయి ఇక ఎలుకలను కూడా పట్టడానికి బోనులు, ట్రాప్ లు వాడుతుంటాం. ఇన్ని ఇబ్బందులు లేకుండా వీటన్నింటినీ తరిమికొట్టే సాధనాన్ని ఆమెరికన్ కంపెనీ టెకో ఆర్ట్ అందుబాటులోకి తెచ్చింది.

ఇది అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్. దీనిని వాడటం చాలా సులువు, ప్లగ్ సాకెట్ లో పెట్టి స్విచాన్ చేసుకుంటే చాలు, ఇది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. దీని ప్రభావంతో చీమలు, దోమలు, బొద్దింకలు మొదలుకొని బల్లులు, ఎలుకలు కూడా ఇంటి పరిసరాల నుంచి పరారై పోతాయి. ఈ అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్ 1200 చదరపు అడుగుల పరిధిలో ప్రభావం చూపుతుంది. దీని ధర 28.99 డాలర్లు (రూ. 2420).

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ  ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version