జిమ్ లో వ్యాయామం చేసేవారికి మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కిళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పి నివారణ మాత్రలు వాడటం పైపూతగా ఆయింట్ మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, నొప్పి ఉన్న చోట పెట్టుకుని దీనికి ఉన్ బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ థెరాబాడీ ఇటీవల రికవరీ థెర్మ్ క్యూబ్ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్వీచ్ లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్ ను అదిమి పెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు(రూ. 12, 350) మాత్రమే.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను సందర్శించండి.