Home » ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త! ఇక నుంచి సర్వీస్ ఫ్రీ..

ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త! ఇక నుంచి సర్వీస్ ఫ్రీ..

by Rahila SK
0 comment
43

ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త! ఇకపై వారు ఒక సర్వీస్‌ను ఉచితంగా పొందవచ్చు. నేటి నుంచి ఆ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఉచిత సదుపాయం ఎయిర్‌టెల్‌ యూజర్లకు మరింత ప్రయోజనం కలిగించనుంది. స్పామ్ కాల్స్ మరియు మెసేజ్లను గుర్తించడానికి AI-ఆధారిత సమాధానాన్ని ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. ఈ సదుపాయం నేటి నుంచి (సెప్టెంబర్ 26, 2024) అందుబాటులోకి వస్తుంది.

ఈ AI-ఆధారిత పరిష్కారం ఎయిర్‌టెల్ యూజర్లకు స్పామ్ కాల్స్ మరియు మెసేజ్ల గురించి అలర్ట్లను అందిస్తుంది. ఇది మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి ఎయిర్‌టెల్ తీసుకున్న చర్యలలో భాగమవుతుంది. ప్రతి రోజు 1.5 బిలియన్ SMS, 2.5 బిలియన్‌ కాల్స్‌ ప్రాసెస్‌ చేస్తుందని చెప్పారు. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వాడే స్మార్ట్‌ఫోన్‌ యూజర్లందరికీ ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందించనున్నట్లు తెలిపింది.

ఈ ఫీచర్ యూజర్లకు ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా చేస్తుంది. ఎయిర్‌టెల్ స్పామ్ కాల్స్‌పై చర్యలు తీసుకునే తొలి నెట్‌వర్క్ అని ఆ సంస్థ వెల్లడించింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version