Home » Boduppal Nimishamba Devi – కోర్కెలు కోరుకుంటే నిమిషంలో ఫలితం ఇచ్చే అమ్మవారు

Boduppal Nimishamba Devi – కోర్కెలు కోరుకుంటే నిమిషంలో ఫలితం ఇచ్చే అమ్మవారు

by Lakshmi Guradasi
0 comments

నిమిషంబిక దేవి – నిమిష అంటే ఒక నిమిషం, అంబ అంటే పార్వతి అని అర్ధం. భక్తులకు దర్శనమిచ్చే నిమిషంబిక దేవి పార్వతి దేవి అంశమని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారు చేతిలో ఖడ్గం తో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని భక్తులు ఏమైనా కోర్కెలు కోరుకుంటే నిమిషంలో ఫలితం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కృష్ణరాజు వడియార్ అనే రాజు 400 ఏళ్ళ క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారన్ని చరిత్ర ద్వారా తెలుస్తుంది. మొదట్లో బాలకొండ లో చిన్నగా ఉంది. అక్కడికి పోలేరని ఇక్కడ బోడుప్పల్ లో ప్రతిష్టించారు.

Boduppal Nimishamba Devi temple

పూర్వం ఇక్కడ ముక్తాకుడు అనే ఋషి ఉండేవాడు. అయన శివుడి అంశా అని అందరూ చెప్పేవారు. రాజులు యాగ సంరక్షణ కొరకు ఆ ఋషిని పిలిచారు. ఆ విషయం తెలిసి రాక్షసులు నాశనం చేయడం మొదలు పెట్టారు. ఆ విద్వాంసాన్ని భరించలేక తన శిరస్సును యజ్ఞం లోకి కండించి పడవేయబోతుంటే. అప్పుడు యజ్ఞ కుండలి నుంచి పార్వతి అమ్మవారు ఉద్బవించి ఒక నిమిషంలోనే రాక్షసులను సంహరించిందంట. ఆలా ఇక్కడ వెలసిన పార్వతి మాతకు నిమిషంబిక అనే పేరు వచ్చినట్లు పురాణాల్లో ఉంది.

Boduppal Nimishamba Devi temple

ధ్వజ స్థంభం దెగ్గర నిల్చుని నిమిషం లో కోరిక కోరి 16 చుట్లు తిరిగితే కోరిక నెరవేరుతుంది. విజ్ఞేషుడు నైరుతి లో ఉన్నాడు కాబట్టి కోరిక 21 రోజులో నెరవేరుతుంది. కోరిక నెరవేరిన తరువాత వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి బియ్యం పోయాలి.

Boduppal Nimishamba Devi temple

అమ్మవారు రెండు రూపాలుగా కనిపిస్తుంది ఒకటి దుర్గ మాత, మరొకటి పార్వతి దేవి. ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీ చక్రాన్ని కూడా ఆరాదిస్తూవుంటారు. ఇక్కడ మక్తికేశ్వరుడిగా శివుడు పూజలు అందుకుంటాడు. ఆలయానికి వచ్చే భక్తులు గాజులు, నిమ్మకాయలు, చీర, మరియు పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు. నిమ్మకాయను తీసుకువెళ్లి ఇంటి పూజ గదిలో పెడితే అన్ని విధాల శుభం జరుగుతుందని అంటున్నారు. అమ్మవారి చీరలను వెళ్ళాం వేస్తారు.

Boduppal Nimishamba Devi temple

శుక్రవారం నాడు రాహుకాలం లో నిమ్మకాయలు తో దీపం ముటిస్తారు. నవరాత్రులలో కుంకుమార్చన, చండి హోమము లు చేస్తారు. అంతేకాకుండా వివిధ అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. కార్తీక మాసం లో విశేష దీప అలంకరణలో ఆలయం అంత వెలుగులతో నిండిపోతుంది.

జేష్ఠ శుక్ల ద్వాదశి రోజున అమ్మవారిని ప్రతిష్టించారు. ప్రతి యేడు ఆ రోజున 1000 లీటర్ ల పండ్ల రసంతో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకాన్ని భక్తులు నేరుగా చూసే అవకాశం ఉంది.

ఇక్కడ ఒక విశేషం కూడా జరుగుతుంది. అది ఏమిటంటే బలిపీఠం మీద అన్నం పెట్టి గంటలను మోగిస్తే ఎక్కడెక్కడనుంచో కాకులు వచ్చి ఈ ఆహారాన్ని భుజిస్తాయంటా. దీనిని బలి భోజనం అని పిలుస్తారు.

నిమిషాంబ దేవి ఖడ్గమాల స్తోత్రం:

ఈ స్తోత్రాన్ని చదవడం ద్వారా మనసులో పవిత్రత, సమాధానం, భక్తి భావనలు కలుగుతాయి. కాదంబమాలా స్తోత్రంలో 16 నిత్య దేవతలు మరియు 64 దండ నామాలను ప్రార్థించడం ఉంటుంది.

ఓం శ్రీం హ్రీం క్లీం ఆం బ్లూం సౌః

ఓం హసకలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం

ఓం ఐం హ్రీం శ్రీం

ఓం శ్రీ మాత్రే నమః

కమేశ్వరి ప్రకృతి రక్షకరే నమః
భగమాలా సహచరే నమః
శక్తి ప్రదాయినీ జగన్మాతా నమో నమః
రక్ష సర్వేశ్వరి నిమిషాంబా నమోస్తు తే

ఓం శ్రీ కదంబగిరి వాసిన్యై నమః
ఓం శ్రీ చక్రవర్తిన్యై నమః
ఓం శ్రీ ఖడ్గమాలాయై నమః
ఓం శ్రీ నిమిషాంబ దేవ్యై నమః

ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించడం వల్ల దేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు.

ఉప ఆలయాలు:

అమ్మవారు స్వామివారితో పాటు సాయిబాబా, దత్తాత్రేయ,వినాయకుడు, హనుమంతుల వారు, రామాలయం నవగ్రహాలు వంటి ఉప ఆలయాలు ఉన్నాయి.

Boduppal Nimishamba Devi temple
Boduppal Nimishamba Devi temple
Boduppal Nimishamba Devi temple

నిమిషంబ దేవి ఆలయ సమయాలు (Nimishamba Devi Temple timings):

ఉదయం: 6:00 AM నుండి 12:30 PM వరకు
సాయంత్రం: 5:00 PM నుండి 8:30 PM వరకు

బోడుప్పల్ నిమిషంబ దేవి ఆలయ అడ్రస్: మన్సాని కాలనీ, పెంట రెడ్డి కాలనీ, వెస్ట్ హనుమాన్ నగర్, బోడుప్పల్, హైదరాబాద్, తెలంగాణ 500092

బోడుప్పల్ నిమిషంబ దేవి ఆలయ లొకేషన్(exact location)

ఇది కూడా చూడండి : Idagunji Ganesha – వినాయకుడిని పెళ్లి పెద్దగా భావిస్తారు…..

Beeramguda Mallikarjuna Bramaramba Temple – 50 కు పైగా సినిమాలకు షూటింగ్స్ చేసిన ఆలయం

మరిన్ని ఇటువంటి ఆలయాల కొరకు తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment