Bharinchalekunnara Kanna Song Lyrics Vagdevi:
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెరిగెను నాలో భారం దయుంచమంటున్నా
కన్నోళ్ళమాటను దాటలేని ఓ రాతి బొమ్మనురా
ఈ రాత రాసిన విధాత భారం నాకంట జారెనురా
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
కన్నోళ్ళమాటను దాటలేని ఓ రాతి బొమ్మనురా
ఈ రాత రాసిన విధాత భారం నాకంట జారెనురా
ఈ కటిక చీకట్లొచేరి పోరాడి నేనోడినా
ఆ సంగతే నీకు తెలిపే వీలంటు లేదే ఎలా
శ్రీరాముడంటి మహరాజే రాజ్యాలు వదిలొచ్చినా
రావణుడిచెరలోని సీతై ప్రతిక్షణము విలపించినా
ప్రాణంగా ప్రేమించే శ్రీకృష్టుడే దొరికినా
రాతల్లో లేని రాధై జన్మంత దుఖ్ఖించినా
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
ఆ నిండు కళ్ళల్లొ దాచి నన్నెంత ప్రేమించినా
ఈ గుండె ఎడబాటు మరిచి బండల్లె నే నిలిచినా
నను కన్నవారింత పెంచి ఇష్టాలనే మరిచినా
కష్టాలనీ దాటలేక కన్నీరుగా మిగిలినా
కాపాడే కన్నపేగే కక్షంటు తరిమేసినా
రకక్షించే ప్రేమ బంధం శిక్షంటు వదిలేసెనా
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
కనురెప్పలల్లో నను దాచి కన్నీళ్ళలో ముంచినా
కడదాక కడతెగని బ్రతుకై కలతల్లె నే మారినా
నా ఊపిరే నాకు బరువై శ్వాసన్నదే ఆడునా
నువులేని జన్మ ఒక శవమై క్షణక్షణము మరణించినా
పరదాలే దాటలేని పరిధుల్లొ నే పెరిగినా
వలలోన చిక్కుకున్న చేపల్లె నే మారినా
వలలోన చిక్కుకున్న చేపల్లె నే మారినా…
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.