ఇంటికి కావాల్సిన ఎలక్ట్రిక్ వస్తువులు కొనాలని (గృహోపకరణాలు) అనుకున్నప్పుడు, వాటి కచ్చితమైన ధర, సైజు, బ్రాండ్ మార్కెట్ విలువ వంటివి తప్పనిసారి. మరి ఇంకొన్ని అదనపు ఫీచర్లు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి పనితీరు సరిగ్గా లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. అందుకనే ఒక వస్తువు కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇక మీరు ఆ విషయం గురించి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటె కొన్నిఎలక్ట్రిక్ వస్తువుల వివరాలు మీ కోసం ఇక్కడ ఉంచాము చూడండి.
శీతలీకరణ ఉపకరణాలు (Refrigeration Appliances):
ఆహార పదార్ధాలు పాడవ్వకుండా కొంత కాలం వరకు నిల్వ చేయడానికి ఈ శీతలీకరణ ఉపకరణాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వేసవి కాలం లో నీరు ని బాటిలలో నింపి, అవి చల్లగా అయ్యగా తాగడానికి బాగా ఉపయోగపడుతుంది. వీటిలో కూడా వివిధ రకాలు ఉన్నాయి.
ఫ్రీజర్‌లు (Freezers): ఈ ఫ్రీజర్లు పచ్చి మాంసాలను భద్రపరచడానికి చాలా బాగా సహాయపడతాయి. Voltas CF HT 320 DD P డబుల్ డోర్ డీప్ ఫ్రీజర్ మీరు కొనుగోలు చేయడానికి మంచిది.
రిఫ్రిజిరేటర్లు (Refrigerators) : వీటిలో సింగిల్-డోర్, డబుల్-డోర్ మరియు మల్టీ-డోర్ అనే రిఫ్రిజిరేటర్లు ఉంటాయి. Whirlpool 240 L Frost Free అనే మల్టీ-డోర్ రిఫ్రిజిరేటర్ ఎంపిక మంచిది.
వాటర్ కూలర్లు (Water Coolers): వేసవి రోజుల్లో చల్లటి నీరు కోసం Voltas Mini Magic Pure-T అనే వాటర్ కూలర్ ను ఎంచుకోండి.
ఐస్ మేకర్స్ (Ice Makers): బార్, పబ్స్ , రెస్టారెంట్‌లు, మరియు లోకల్ కూల్ డ్రింక్స్ లలో ఐస్ క్యూబ్ లు అవసరం. అందుకోసం Ice the Matiic Ice Cube Maker అనేదాన్ని కొనుగోలు చేయడం మంచిది.
వంట ఉపకరణాలు (Cooking Appliances):
కిచెన్ స్టవ్స్ (Kitchen Stoves): సాదారణముగా వాడుకునే గ్యాస్ బర్నర్స్, ఇవి సులభంగా వాడుకోవడానికి, తిరిగి శుభ్రపరచడానికి అనువైనవి. వీటిలో Prestige IRIS LPG గ్యాస్ స్టవ్ ను చూడండి.
రైస్ కుక్కర్లు (Rice Cookers) : ఈ రైస్ కుకర్లలో కేవలం తగిన నీరు కావాల్సిన బియ్యం వేసి మూత పెడితే కొద్దీ సమయంలోనే రైస్ ను తయ్యారు చేస్తుంది.
రోటీ మేకర్స్ (Roti Makers): ఇంట్లో చేసుకునే రోటీలు సరైన ఆకారంలలో రావు అలంటి సమయాలలో ఈ రోటి మేకర్స్ ఉపయోగపడతాయి. ఇవి ముఖ్యంగా రెస్టారెంట్ లో పని చేసే చెఫ్‌లకు అవసరం. అందుకోసం Prestige Roti Maker or iBELL RM150 ROTI MAKER ను వాడండి.
స్టీమర్ ఓవెన్‌లు (Steamer Ovens): ఇవి పదార్ధాలనుఉంచుకోవడానికి రెస్టారెంట్ లో వాడతారు.
మైక్రోవేవ్‌లు (Microwaves): ఇవి వంట, బేకింగ్ మరియు గ్రిల్లింగ్ వంటి వాటిని చేయడానికి ప్రధానమైనవి.
వాషింగ్ & డ్రైయింగ్ ఉపకరణాలు (Washing & Drying Appliances):
ఈ కాలంలో ఉద్యోగాలు చేసేవారు, ఇంటి పనులకు సమయం లేనివారు ప్రధానంగా వాడే పరికరము వాషింగ్ మెషిన్. ఈ మెషిన్ లలో కూడా వివిధ రకాలు ఉన్నాయి.
వాషింగ్ మెషీన్లు (Washing Machines): టిక్ మరియు సెమీ ఆటోమేటిక్ ఎంపికలు ఉన్న Samsung 7.2 kg సెమీ-ఆటోమేటిక్ లేదా Whirlpool 7 Kg 5 Star Royal Plus ఫుల్లీ-ఆటోమేటిక్ ను తీసుకోవడం మంచిది.
బట్టలు ఆరబెట్టేది (Clothes Dryer): ఒకవేళ వర్షానికి తడిచిన బట్టలను ఆరబెట్టాలంటే చాలా త్వరగా ఆరబెట్టే FB Dryer ను కొనుగోలు చేయడం మంచిది.
డ్రైయింగ్ క్యాబినెట్‌లు (Drying Cabinets) : చాలా సున్నితమైన బట్టలు, పలుచని బట్టలు చిరగాకుండా ఉండడం కోసం వాడేవి.
హీటింగ్ & కూలింగ్ ఉపకరణాలు (Heating & Cooling Appliances):
ముమూలుగా వాతావరణం లో జరిగే మార్పుల వలన చలి, వేడి ధాటికి మనుషులు గురౌతారు అటువంటి సందర్భాలలో ఈ హీటింగ్, కూలింగ్ పరికరాలు పనికొస్తాయి.
ఎయిర్ కండిషనర్లు (Air Conditioners); వేసవి కాలంలో అధిక వేడిని తట్టుకోవడం కష్టతరం అవుతుంది. అందువలన Panasonic 1.5 Ton 5 Star AC అనే ఎయిర్ కండిషనర్లు వాడితే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
రేడియేటర్లు (Radiators): ఇవి చల్లని ప్రాంతంలో నివసించే వారికీ సహాయపడతాయి. రేడియేటర్లు వేడి గాలి ని ఉత్పత్తి చేస్తాయి.
వాటర్ హీటర్లు (Water Heaters): సాధారణంగా అందరూ వేడి నీటినే స్నానానికి ఉపయోగించడానికి మొగ్గు చూపుతారు. అందుకోసం ఈ వాటర్ హీటర్లు సహాయపడతాయి.
వంటగది ఉపకరణాలు (Kitchen Appliances):
వంట గదిలో చాలా వస్తువులు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటి సందర్భాలలో వంటను సులభతరం చేసేందుకు కింద ఇవ్వబడిన వస్తువులను మీ వంటింట్లో చేరిస్తే మీకు సహాయపడతాయి.
కాఫీ తయారీదారులు (Coffee Makers): పొద్దునే లేవగానే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అందుకోసం బయట చాలా షాప్ లు ఉంటాయి. ఆ షాప్ లా కాఫీ తయారీదారులు ఉపోయోగపడే పరికరం Pigeon Stovekraft Brewster.
బ్లెండర్లు (Blenders): ఇవి ఫ్రూట్ లు వంటి ని జ్యూస్ లా తయారుచేయడానికి ఉపయోగపడతాయి.
మిక్సర్లు (Mixers): ఇవి పెద్ద మోతాదులో ఉన్న వాటిని కొద్దీ మోతాదుకు వచ్చేలా మిక్సీ చేస్తాయి. పొడి గా, మెత్తగా కావాలి అనుకునే వారికీ వీటిని వాడవచ్చు.
మట్టి కుండలు (Crock Pots): ఇవి అధునాతన ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్లు.
కిచెన్ హుడ్స్ (Kitchen Hoods): వంటగది గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
మరిన్ని ఇటువంటి పరికరాల కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను చూడండి.