స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితాలలో ఒక భాగం అయిపొయింది. దాంట్లో నే ప్రపంచాన్ని చూస్తాము. ఈ మొబైల్ ఫోన్ వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే ఆపదలు ఉన్నాయి. మొబైల్స్ ద్వారా ఎప్పుడు ఏ సైబర్ క్రైమ్ జరుగుతుందో చెప్పలేము. ఆలా జరగకుండా ఉండదానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకైనా ఆ సైబర్ క్రైమ్ ల నుండి తప్పించుకోవచ్చు.
అలంటి వాటిలో ముఖ్యమైనది మన ఫోన్ ను ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేయడం. ఫోన్ రీస్టార్ట్ చేయడం వలన ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
- మనం మన ఫోన్ ని వారం లో ఒక్కసారి అయినా రీస్టార్ట్ చేయాలి అని NSA (National Security Agency) చెప్తుంది.
- రీస్టార్ట్ చేయడం వల్ల మీ మొబైల్ సైబర్ అటాక్స్ లో భాగంగా జరిగే వాటి నుండి కాపాడుతుంది. మీ మొబైల్ రిమోట్ యాక్సిస్ ను పొందే జీరో క్లిక్ ఎక్సప్లోయిట్స్ (Zero Split Exploits) జరగకుండా ఆపుతుంది.
- రీస్టార్ట్ చేయడం వలన హ్యాకర్లు మీ మొబైల్ నుంచి ఇన్ఫర్మేషన్ దొంగిలించడం చాల డిఫికల్ట్ గా మారుతుంది.
- రెగ్యులర్ గా రీస్టార్ట్ చేయడం వలన మెమరీ మరియు బాక్గ్రౌండ్ లో రన్ అయ్యే అప్స్ క్లియర్ అయ్యి మీ మొబైల్ స్లో డౌన్ ప్రాబ్లెమ్ తగ్గి స్మూత్ గా పని చేస్తుంది.
- రీస్టార్ట్ చేయడం వలన మీ మొబైల్ బాటరీ లైఫ్ కూడా మెరుగు పడుతుంది.
- తరచు గా మొబైల్ ను రీస్టార్ట్ చేయడంవలన హీటింగ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది.
- రీస్టార్ట్ చేయడం వళ్ళ మొబైల్ లో నెట్వర్క్ సిగ్నల్స్ ఇష్యూ అండ్ వైఫై కనెక్టివిటీ ఇష్యూ ని కూడా ఫిక్స్ చేయవచ్చు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.