92
కివి పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థంలు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ C కూడా పుష్కళంగా ఉంటుంది. మనం కివి పండు తొక్కతీస్తే అందులోని గుజ్జలో నల్లటి గింజలు ఉంటాయి. ఈ గింజలలో ఒమేగా – 3 ప్యాటి ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
- గుండె జబ్బులు ఉన్నవారు తరుచుగా కివిని తినడం వల్ల చాలా మేలు జరుతుంది.
- హై బీపి ఉన్నవారు కివి పండును తినడం వల్ల రక్తపోటు అనేది కంట్రోల్ లోకి వస్తుంది.
- కివి శరీరంలో షుగర్ స్థాయిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
- కివిపండుని తినడం వల్ల చర్మం నిగారింపుగా ఉంటుంది. ఇంకా ఎముకల సమస్యల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది.
- కివి తినడం వల్ల చర్మ క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. ఇంకా రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా అరికడుతుంది.
- ఈ పండును తినడం వలన కళ్ళ కింద వచ్చే నల్లని మచ్చలను తగ్గిస్తుంది. మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
- ముఖ్యంగా ఇది శిశువులో RNA మరియు DNA లను బలపరుస్తుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్‌ను సందర్శించండి.