ఉదయాన్నే పఫ్డ్ రైస్ లేదా మరమరాలు (బొరుగులు, పేలాలు) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. మీరు ఈ ప్రయోజనాలను పొందుతారు. పఫ్డ్ రైస్ చాలా రకాలుగా వండుకుని అల్పాహారంలోకి, స్నాక్స్ లోకి తింటాం. వీటిని పఫ్డ్ రైస్ అంటారు. కానీ ఇది అంతగా ప్రాచుర్యం పొందడానికి దానికున్న పోషకల విలువలూ కారణమే.
పిల్లల ఆరోగ్యం: పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడంలో మరమరాలు సహాయపడతాయి. వీటిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల, రక్తహీనత సమస్యలను నివారించడంలో కూడా ఉపయోగపడతాయి
బరువు తగ్గడం: పఫ్డ్ రైస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు పేలాలను తినడం వల్ల కాస్త కడుపు నిండినట్లు ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఒంట్లోకి చేరవు. కాబట్టి వీటిని డైట్ లో భాగం చేసుకోవచ్చు.
ఎముకలను బలోపేతం చేస్తుంది: పఫ్డ్ రైస్ లో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. వీటివల్లఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
జీర్ణశక్తిని పెంచుతుంది: కడుపులో అజీర్తి లాంటి సమస్య ఉన్నప్పుడు పఫ్డ్ రైస్ తినమని సిఫార్సు చేస్తారు. దీనివల్ల గ్యాస్, ఛాతీలో చికాకు లాంటి సమస్యలు తగ్గుతాయి. దీన్ని రోజూవారీ తిన్నా ఏ సమస్యా ఉండదు. సులువుగా జీర్ణం అవుతాయి కూడా.
రక్తపోటును నియంత్రిస్తుంది: పఫ్డ్ రైస్ లో సోడియం స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి అధిక రక్తపోటు ఉన్నా కూడా, మీరు ఒక గిన్నె నిండా పఫ్డ్ రైస్ కూడా తినవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పఫ్డ్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.