Home » బీరుతో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది

బీరుతో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది

by Shalini D
0 comment
44

బీరు తాగే వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు బీరుతో స్నానం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అనేక శాస్త్రీయ అధ్యయనాలు ప్రకారం బీర్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. తూర్పు ఐరోపాలోని దేశాల్లో పురాతన సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయంలో బీర్ బాత్ ఒకటి. అంటే టబ్ లో ఉన్న నీటిలో బీరు కలుపుకొని అందులో గంటల కొద్దీ కూర్చుని స్నానాలు చేస్తూ ఉంటారు.

ఇలా చేయడం వల్ల అది చర్మాన్ని శుభ్రపరుస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు. అలాగే శరీరం నుండి విషాలు, వ్యర్థాలను కూడా విడుదల చేస్తుందని అంటారు. ఇప్పుడు మళ్లీ బీర్ బాత్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ బీర్ బాత్ చేసేందుకు ఇష్టపడుతున్నారు.

బీర్ బాత్ ఉపయోగాలు: బీర్ తయారీలో బార్లీ, ఈస్ట్ పదార్థాలు ముఖ్యమైనవి. ఇవి కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. అందుకే బీర్‌తో స్నానం చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్లను వదిలించుకోవచ్చు అని నమ్ముతారు. అలాగే చర్మాన్ని తేమగా మార్చుకోవచ్చు అని అంటారు.

కొంతమంది వైద్యులు కూడా విషయాన్ని సమర్థిస్తున్నారు. ఒక చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ బీర్‌లోని అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి చర్మం తేమను కాపాడతాయి.

బీర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆమ్లాలు చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో ముందుంటాయి. మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలను అడ్డుకోవడానికి సహాయపడుతుందని కూడా చెబుతున్నారు. బీర్ బాత్ కోసం తాగే బీర్లను నీటిలో కలపరు. వీటి కోసం ప్రత్యేకంగా బీర్లను తయారు చేస్తారు. మద్యంతో స్నానం చేస్తున్నామని ఎంతో మంది అనుకుంటారు.

నిజానికి బాత్ టబ్ లో వేసి పూర్తి మద్యం కాదు. ఈ స్నానంలో బీర్‌లో వాడే పదార్థాలనే వాడతారు, కానీ పూర్తిగా తాగే బీర్‌ను మాత్రం ఇందులో కలపరు. కాబట్టి ఎప్పుడైనా బీర్ బాత్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేయండి. ఇది ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదే… కానీ ఆ బీర్ బాత్ డ్రింకును మాత్రం నోట్లో వేసుకోకండి.

బీరుతో స్నానం: ప్రయోజనాలు మరియు ప్రమాదాలు

చర్మ ఆరోగ్యం: బీర్‌లోని మెలనిన్ చర్మ కాంతిని పెంచుతుందని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయవచ్చు. అయితే, ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు.

చర్మ క్యాన్సర్: నిపుణులు హెచ్చరిస్తున్నది ఏమిటంటే, బీర్‌తో స్నానం చేయడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది చర్మానికి హానికరమైన ప్రభావాలను కలిగించవచ్చు.

ట్రెండ్: పాశ్చాత్య దేశాలలో “బీర్ టానింగ్” అనే ప్రక్రియ ప్రాచుర్యం పొందింది, దీనిలో బీర్‌ను చర్మంపై పోసి సూర్యరశ్మి ద్వారా టాన్ చేయడం జరుగుతుంది. ఇది కొన్ని వ్యక్తులకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ ఆరోగ్యానికి హానికరమైనది.

స్నానం సమయం: సాధారణంగా, బీరుతో స్నానం చేయడం అనేది సాధారణ స్నానానికి సమానమైన సమయం, అంటే సుమారు 15 నుండి 30 నిమిషాలు పడవచ్చు. సారాంశంగా, బీరుతో స్నానం చేయడం కొంతమంది కోసం ఆసక్తికరమైన అనుభవంగా ఉండవచ్చు, కానీ దీని ఆరోగ్య ప్రభావాలను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version