Home » మహేష్ బాబు సూపర్ హిట్ బంగారు కళ్ల బుచ్చెమ్మో సాంగ్ లిరిక్స్ – మురారి

మహేష్ బాబు సూపర్ హిట్ బంగారు కళ్ల బుచ్చెమ్మో సాంగ్ లిరిక్స్ – మురారి

by Vinod G
0 comments

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే

వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

నీలో చింతచిగురు పులుపున్నదే

బుల్బుల్ పిట్ట మల్మల్ పట్ట

కవ్వంలాగ చిలికే కులుకున్నదే

తళుకుల గుట్ట మెరుపుల తట్ట

నీలో చింతచిగురు పులుపున్నదే

కవ్వంలాగ చిలికే కులుకున్నదే

కొంటెమాట వెనుక చనువున్నదే

తెలుసుకుంటే మనసు పిలుపున్నదే

కళ్లుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే

ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో

నిన్న నేడు రేపు ఒక నిచ్చెన

సిరిసిరి మువ్వ గడసరి గువ్వ

మనకు మనకు చెలిమే ఒక వంతెన

సొగసుల పువ్వా ముసిముసి నవ్వా

నిన్న నేడు రేపు ఒక నిచ్చెన

మనకు మనకు చెలిమే ఒక వంతెన

ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా

మురళి కాని వెదురై పోదా జన్మ

చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయీ

జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠీ

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే

వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

చిత్రం:మురారి
గాయకులు:ఉదిత్ నారాయణ్
సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ
సంగీతం:మణిశర్మ
దర్శకత్వం:కృష్ణ వంశీ
తారాగణం:మహేష్ బాబు, సోనాలి బింద్రే తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment