నేలపైన పువ్వులన్ని అక్షారాలాయే
నింగిలోన రంగులన్నీ కాగితాలయే
నీకు నాకు లోకమంతా ప్రేమ కవితాయే
ప్రేమలోన ఈ క్షణాలే శాశ్వతాలయే
ఇంకేమి వద్దంటా ఇంకేమి వద్దంటా
నువ్వుంటే చాలంటా అంతే..
బంగారం అక్కర్లేని సింగారం యాడుందంటే
అచ్చంగా చూపిస్తానే నిన్నే..
ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం యాడుందంటే
స్వచ్ఛంగా చూపిస్తానే నిన్నే..
నవ్వులోని తీపినంతా జీవితాన నింపనా
మాటలోని తెలుపునంతా మమతలోకి వంపనా
ఎదో ఎదో అడగనా గుర్తే రాక అలగనా
నిన్నే చూస్తూ నిలువునా అన్ని అన్ని మరవనా
ఇంకేమి వద్దంటా ఇంకేమి వద్దంటా
నువ్వుంటే చాలంటా అంతే..
బంగారం అక్కర్లేని సింగారం యాడుందంటే
అచ్చంగా చూపిస్తానే నిన్నే..
ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం యాడుందంటే
స్వచ్ఛంగా చూపిస్తానే నిన్నే..
ముచ్చటైన ఊసులన్నీ మెట్టెలాగా చెయ్యనా
పచ్చనైనా ఆశలన్నీ తాళిలాగా వెయ్యనా
ఏడే కాదు బతుకునా ఎన్నో వేళ అడుగులు
నీతో పాటే నడవనా నాతో నిన్నే నడపనా
ఇంకేమి వద్దంటా ఇంకేమి వద్దంటా
నువ్వుంటే చాలంటా అంతే..
బంగారం అక్కర్లేని సింగారం యాడుందంటే
అచ్చంగా చూపిస్తానే నిన్నే..
ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం యాడుందంటే
స్వచ్ఛంగా చూపిస్తానే నిన్నే..
Song Credits:
పాట పేరు: బంగారం అక్కర్లేని (Bangaram Akkarleni)
సినిమా పేరు: 23
గాయకులు: కార్తీక్ (Karthik), రమ్య బెహరా (Ramya Behara)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
సంగీతం: మార్క్ కె రాబిన్ (Mark K Robin)
నటీనటులు : తేజ (Teja), తన్మయి (Tanmai),
దర్శకుడు: రాజ్ ఆర్ (Raj R)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.