Bangaari Bangaari song lrics Mension House Mallesh:
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే… హొయ్
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…
నీ కొరకేగా నేను
నా కోసం నే లేను
పుడతానే నీ పెండ్లాలమై పుట్టేసాను..
నిన్ను దాటి పోలేను
నీ లోపట చేరాను
ఇక జనమ లెన్నైనా నీతోనే నేను…
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే…
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…హొయ్
నాకేమైన అయినదంటే తల్లడిల్లిపోయే నువ్వు
ఊపిరాపి ఉరకలు పెడతావు…
నొప్పి నాకు కలిగిందంటే కంట్లో నీటి చేరువైతావు
నన్ను తలచి నిద్దర చెడతావు…
ఎంత ఎంత ప్రేమను నువ్వు దాచినావు నా పైన
అంతకన్న మిన్నగా చూసుకోలేనా నిన్ను
కంటి రెప్ప కావాలిగా నా కలత నలత ఏదైనా
చంటి పాప నువ్వని అనుకుంటాను…
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే…
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…
ఒక్క నాకే సొంతం నువ్వు
కంటి పాప మొత్తం నువ్వు
ముప్పోద్దుల నీ మీదే ధ్యానం…
నడుం మీది మచ్చవు నువ్వు
గుండె మీది పచ్చవు నీవు
నీతో కలిసి పోయినది ప్రాణం…
ఒకరికొకరు నువ్వు నేను
రెండు జంట పావురాలు
మనకి మనం తోడై ఉంటే చాలు…
పనికి రావు నీకు నాకు లేనిపోని దూరాలు
చెరిసగాలు సరదాలు సరసాలు…
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే…
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…
Song Credits:
సంగీతం: సురేష్ బొబ్బిలి (Suresh bobbili)
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati putra Ramajogayya shastry)
గాయని: హరిణి ఇవటూరి (Harini ivaturi)
తారాగణం: శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti), గాయత్రి రమణ (Gayathri Ramana),
రచన & దర్శకత్వం: బాల సతీష్ (Bala Satish)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.