Home » బాలుడు తోటకూర – నీతి కథ

బాలుడు తోటకూర – నీతి కథ

by Rahila SK
0 comments
baludu thotakura moral story

ఒక గ్రామములో సుశీల అనే ఆమెకి, సురేష్ అనే కొడుకు ఉన్నాడు. అతను చిన్నతనములో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మానాయనె… అని మెచ్చుకొన్నది. అది ఏదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలాబాగున్నదని తలచి ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటిలో నుంచి వస్తువులు తీసుకురావడము మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూలులో, తనతోటి పిల్లల దగ్గర పెన్ను గానీ, పెన్సిల్ గానీ, పుస్తకం గానీ, దొంగతనముగా తీసుకురావడము మొదలు పెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడైయ్యేటప్పటికి గజదొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒక రోజు రక్షక భటులు ఇతన్ని పట్టుకొనిపోవుచూండగా అతని తల్లి “అయ్యో… తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేక పొయానే… చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాక పోవును కదా అని దుఖించింది.

నీతి: కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.