Bagunnave Bujji Song Lyrics Folk:
బాగున్నావే బుజ్జి బంగారమోలే
అందాల తారల్ని తలపించేటి చూపు నీ కన్నులు
ముత్యాలు జారేలా మురిపించుతున్నాయి నీ నవ్వులు
పది మంది చూస్తారు ఆపవయ్యా బాబు నీ సోకులు
పోయేటి తోవలో ఎందుకయ్యా చెప్పు ఈ బాధలు
గుండె లాగుతున్నటు ఉన్నదే
నీ తోడే కోరుకుంటున్నదే
మంచు జోరు మీదనే ఉన్నవే
తగ్గించుకో ఈ వేషాలే
వచ్చి వచ్చి దగ్గరికొచ్చి అట్ట ఎళ్ళిపోకే బుజ్జి
అట్ట ఎళ్ళిపోకే బుజ్జి
బాగున్నావే బుజ్జి బంగారమోలే
నా మనసులోకి వచ్చి ఉండిపోవే
అబ్బా బాగున్నావే బుజ్జి బంగారమోలే
నా ప్రేమలోకి వచ్చి నిలిచిపోవే
ఓ పున్నమేళ నాకు నువ్వే ఎదురొచ్చినావే
నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నే మరిసానే
మరియంత సోకులు పడకు నేనన్ని తెలిసినదాన్నే
మాటలు చెప్పి నన్నే పిచ్చి దాన్ని చేయకే
వదొద్దు అనకే బుజ్జి
నాతోడు ఉండవే వచ్చి
ఊర సూపులతో సూసి
నన్ను సంపమాకయ్యా బన్నీ
నా అడుగులోను అడుగేసి
రాయే బంగారి
బాగున్నావే బుజ్జి బంగారమోలే
నా మనసులోకి వచ్చి ఉండిపోవే
అబ్బా బాగున్నావే బుజ్జి బంగారమోలే
నా ప్రేమలోకి వచ్చి నిలిచిపోవే
రేయిలో హాయిగా నేను
నీ ఊహల్లో ఉంటున్నానే
నా ఇంటికి ఎప్పుడొస్తావో అంటూ
కలలే కంటున్నానే
కవిలాగా కవితలు చెప్పి నన్నే మలుపుకోకే
దెబ్బలు పడతాయి చూడు
జాగ్రత్తగా నువ్వుండే
కరుణియరాదే బుజ్జి
కలిసుంటానే ప్రతి జన్మకి
మాయలోడివయ్యా బన్నీ
నువ్వే నాకు అన్ని
ఈ మాట చాలే ఏలుకుంటానే నిన్నే నా రాణి
నచ్చినావురా బన్నీ ఉంటా నీ తోడే
నీ మనసులోకి వచ్చి ఉండిపోతానే
బాగున్నావురా బన్నీ బంగారమోలే
నీ ప్రేమలోకే వచ్చి నిలిచిపోతాలే
నచ్చినావురా బన్నీ….
నీ మనసులోకి వచ్చి….
Song Credits:
నిర్మాత: విహారిక (VIHARIKA)
సాహిత్యం: సిద్దూ యాదవ్ (SIDDU YADAV)
గాయకులు: సుమన్ బదంకల్ (SUMAN BADANKAL) & శ్రీనిధి (SRINIDHI)
సంగీతం: వెంకట్ అజ్మీరా (VENKAT AJMEERA)
నటీనటులు: శ్రవణ్ ఆర్య (SRAVAN AARYA) & చెర్రీ (CHERRY)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.