బే కన్నుల్తో తిట్టమాకే (Don – Bae Song Lyrics Telugu) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

బే కన్నుల్తో తిట్టమాకే
క్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయిందే
బే ఇంకా నవ్వు దాచుకోకే
నీ నవ్వే నా పెదవిని చేరి ఉంటానన్నదే

ఇదిగో నిన్ను నా కన్నులోన దాచేస్తున్నాలే
మనసే కాదు నా జగమే నీకు సొంతం అన్నలే
కథలు మొదలు చిట్టచివర నీవే నీవంటున్నలే
నాలో నువ్వే అని ఆకాశంలో రాసేస్తున్నాలే

అందం అంటే నువ్వేనే
దైవం నీలా నవ్వేనే
ఎంతో మారనే నీవల్లే
చూడు నాలో నేలేనే
నావే నీవే నీవేనే
గల్లంతయ్య నీలోనే
ముందే ముందే పుట్టా నీకై నెనేనే

బే కన్నుల్తో తిట్టమాకే
క్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయిందే
బే ఇంక నవ్వు దాచుకోకే
నీ నవ్వే నా పెదవిని చేరి ఉంటానన్నదే

ఇదిగో నిన్ను నా కన్నులోన దాచేస్తున్నాలే
మనసే కాదు నా జగమే నీకు సొంతం అన్నలే
కథలు మొదలు చిట్టచివర నీవే నీవంటున్నలే
నాలో నువ్వే అని ఆకాశంలో రాసేస్తున్నాలే

దారి ఏదైనా తోడు నెనేలే
ప్రేమ నిలువెత్తు రూపం అయ్యావే
ఓ.. చెట్టాపట్టాలే వేసుకుందామే
చుట్టు ఉన్నోళ్లు లేరు అందామే

తెలుసా ప్రేమనే.. అణిచి ఆపితే అది నేరం
దూకేయ్ చినుకులా.. ఇంకా వద్దులే దూరం
ప్రేమ సౌధమే నిన్ను చూడగా వేచుందిలా…
చూపించంగా తెచ్చానే..

అందం అంటే నువ్వేనే
దైవం నీలా నవ్వేనే
ఎంతో మారనే నీవల్లే
చూడు నాలో నేలేనే
నావే నీవే నీవేనే
గలంతయ్య నీలోనే
ముందే ముందే పుట్టా నీకై నెనేనే

బే కన్నుల్తో తిట్టమాకే
క్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయిందే
బే ఇంకా నవ్వు దాచుకోకే
నీ నవ్వే నా పెదవిని చేరి ఉంటానన్నదే

ఇదిగో నిన్ను నా కన్నులోన దాచేస్తున్నాలే
మనసే కాదు నా జగమే నీకు సొంతం అన్నలే
కథలు మొదలు చిట్టచివర నీవే నీవంటున్నలే
నాలో నువ్వే అని ఆకాశంలో రాసేస్తున్నాలే

_________________

సినిమా : కాలేజ్ డాన్ (College Don)
పాట – బే (Bae)
గాయకులు – ఆదిత్య ఆర్కే (Adithya RK)
లిరిక్స్ – శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
నటీనటులు : శివకార్తికేయన్ (Sivakarthikeyan), ప్రియాంక మోహన్ (Priyanka Mohan),
రచయిత మరియు దర్శకుడు: సిబి చక్రవర్తి (Cibi Chakaravarthi)
సంగీతం: అనిరుధ్ (Anirudh)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like