బచ్చలింటి కుర్రాడిని మాట వినని మొండోడిని
ఎవ్వరెందరున్నా గాని ఒంటిచేత్తో ఆపేటోడ్ని
జాలి లేని జాబిలి తీరు జారుకోకే…
లైట్ లేని వీధి స్థంభంలా నించున్నానే
తెగిన గాలి పటం నేను నేనై తిరుగుతున్నానే
అయ్యో.. దారితెన్ను తీరం లేని నావైననే..
ఇంత కర్మ నాకేంటని నన్ను నేనే తిట్టేసుకొని
అయినా చాలా బాగుందని భుజము నాదే తట్టేసుకొని
నాటు సారా నీటుగా తాగే నాటు గాడ్నే..
ఉగ్గు పాలు తాగే చంటోడిని చేసినావే..
మాట చెప్పి చెప్పక దాచి వెళ్ళిపోతే మౌనం
విడకుంటే కలిసేదెలా జాతకాలే
ఎన్నాళ్ళీ పంచాయితీ తేల్చవే పోతుందే మతి
బాగాలేదే నీ పద్ధతి చేస్తున్నావే అందంగా అతి
కాగితాల ప్రేమ లేఖనే రాయలేనే..
కావాలంటే వేటూరి పాటే వినిపిస్తాలే
ఉప్పు నీటి సంద్రమంతా మనసున్నదే
చెంచాడు చెక్కరేసి తీపిగా నన్నే మార్చేయరాదే
_______________________
సాంగ్: బచ్చలింటి కుర్రాడిని (Bachhalinti Kurradini)
మూవీ : బచ్చల మల్లి (Bachhala Malli)
గాయకుడు: కార్తీక్ (Karthik)
సాహిత్యం: తిరుపతి జవానా (Tirupathi Jaavana)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar)
తారాగణం: అల్లరి నరేష్ (Allari Naresh), అమృత అయ్యర్ (Amritha Aiyer )
దర్శకత్వం: సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi)
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.