Home » అత్తగారింటికి Athagaarintiki Song Lyrics | Love Failure

అత్తగారింటికి Athagaarintiki Song Lyrics | Love Failure

by Lakshmi Guradasi
0 comments
Athagaarintiki Song Lyrics Love Failure

Athagaarintiki Song Lyrics in Telugu, Love Failure | Bullet Bandi Laxman | Kittu Pavan

నువ్వు నాకు కానరావే అని
ఎవరి కంట్ల పడకుండా నేను వెళ్ళిపోతున్నానే
నువ్వు నాతో మాటాడలేవే అని
ఎవరితో మాటకుండానే వెళ్ళిపోతున్నానే
నువ్వు ఈ లోకంలో లేనేలేవే అని
నేనీలోకాన్ని వదిలేసి పోతున్నానే

నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి

పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే
నీ పెదవుల సిరినవ్వై నే పూసే పోతానే
జిల్లేడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే
నీ తలపై తలువాలు నే పోసేపోతానే

నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి

పిడికిళ్లతో మన్నే నాపై పోస్తూవున్నారే
తలువాలు ఒడిబియ్యలు నువ్వు పోసుకోవే
ఈ మన్ను పరుపుల నేనే పడుకుంటున్నానే
ఆ పువ్వుల పరుపుల నువ్వు హాయిగా నిదరోయే

పైసా పైసా అన్నడు కదనే నిన్ను కన్న నాన్న
ఆఖరికి కురిసేది ఆటన చిక్కల నానా
పరువు పరువు అంటూ తీస్తిరి గదనే పరుగు
ప్రాణం పోయినంక మోగేదే డప్పుల దరువు

ఉండదే నీకే హాని పిల్ల పాపలతోని
హాయిగా బతుకే నువ్వు వందేళ్ళు

నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి

Athagaarintiki Song Lyrics in English:

Nuvvu naaku kaanaraave ani
Evari kantla padakunda nenu vellipothunnaane
Nuvvu naatho maatadaleve ani
Evaritho maatakundaane vellipothunnaane
Nuvvu ee lokamlo lenenleve ani
Neneelokanni vadilesi pothunnaane

Nuvvu puvvulu allukoni pothunnave athagaarintiki
Ne puvvulu jallukoni pothunnane kaale kaatiki
Nuvvu puvvulu allukoni pothunnave athagaarintiki
Ne puvvulu jallukoni pothunnane kaale kaatiki

Pasupu taanaalu naaku poyistunnare
Nee pedavula sirinavvai ne poose pothaane
Jilledu chettuto pelli chesestunnare
Nee talapai taluvaalu ne pose pothaane

Nuvvu puvvulu allukoni pothunnave athagaarintiki
Ne puvvulu jallukoni pothunnane kaale kaatiki
Nuvvu puvvulu allukoni pothunnave athagaarintiki
Ne puvvulu jallukoni pothunnane kaale kaatiki

Pidikillatho manne naapai postuvunnare
Taluvaalu odibiyyalu nuvvu posukove
Ee mannu parupula nene padukuntunnaane
Aa puvvula parupula nuvvu haayiga nidaroye

Paisa paisa annadu kadane ninnu kanna naanna
Aakhariki kurisedi aatana chikkala naana
Paruvu paruvu antoo teestiri gadane parugu
Praanam poyinanka mogede dappula daruvu

Undade neeke haani pilla paapalatoni
Haayiga batuke nuvvu vandelllu

Nuvvu puvvulu allukoni pothunnave athagaarintiki
Ne puvvulu jallukoni pothunnane kaale kaatiki
Nuvvu puvvulu allukoni pothunnave athagaarintiki
Ne puvvulu jallukoni pothunnane kaale kaatiki

Song Credits:

నిర్మాత: సాయి పవార్ (Sai Pawar )
లిరిక్స్ & డైరెక్షన్ సింగర్: బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
సంగీతం : మదీన్ SK (Madeen SK)
కోరస్ : హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav) & మదీన్ SK (Madeen SK)
నటీనటులు : కిట్టు పవన్ (Kittu Pavan) , శిరీష_లక్ష్మణ్ (Shirisha_Laxman)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.