ఆటల పాటలా (Atala Patala) సాంగ్ లిరిక్స్, ఆకాశమంత (Aakasamantha)

by Lakshmi Guradasi

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా
మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా

అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే
మాధురమౌ భావాలేవో మోగే లోలోనా
పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే
ఉరకలే పదులై వేలై పొంగే నాలోనా
లాలిపాటే నేనై లాల పోసేవాణ్ణై
నాన్ననై నింపనా లేత హృదయానా

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా

ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు
అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం
క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనాన

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా

____________

పాట: ఆటల పాటలా (Atala Patala)
చిత్రం: ఆకాశమంత (Aakasamantha)
నటులు: ప్రకాష్ రాజ్ (Prakash Raj), త్రిష కృష్ణన్ (Trisha Krishnan)
సంగీత దర్శకుడు: విద్యా సాగర్ (Vidya Sagar)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
గాయకులు: మధు బాలకృష్ణన్ (Madhu Balakrishnan)

See Also: Okanoka Voorilo song lyrics Aakasamantha

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like