ఒరేయ్ అశోకు జర సూడురా
ఇడేమో వచ్చింది లగ్గమాడమంటుంది
నీ పేరే చెప్పినానూరో
నిన్ను మనసేమో మెచ్చింది
నీ వెనకే వస్తుంది
జర్రనైన గానవు ఏందో
మంచి ఈడు ఉన్నపుడే
కోరి నేను వచ్చిన నా కొంగు పట్టుకో
ముచ్చటగా మూడు ముళ్ళు మెళ్ళో ఏసుకో
నా పెనీవిటివై పక్కనుండి నన్ను ఏలుకో
వద్దన్న ఇడువను కాదన్న కదలను
నన్ను లగ్గమాడేదాకా నిన్ను ఇడిసి పెట్టాను
అశోకు అందాల బొమ్మను నేను
నా సోకు నీకే నే రాసిచ్చాను
పిల్లగా అశోకు పల్లెటూరి పడుచు పిల్లను
నా సెయ్యి పడితే ఈ పానమిస్తాను
కళ్ళకేమో కాటుక పెట్టినాను పిల్లగాడా
నువ్వు నన్ను చుత్తవని ఎంతో ఆశతో
పట్టిలంతా సవ్వడి చేసిన పొల్లగాడ
నా దారెంట వస్తావని సందెపొద్దుల
ఆస్తి పాస్తులడిగిన్న నిన్ను మాటిమాటికి
నా చెంతకైనా చేరవా నువ్వు ఈ పూటకి
మనసు వాడి వస్తే వద్దంటావేమిటీ
ఇంతనైనా మారవా అంత టెక్కు దేనికి
ఎహే వద్దన్న ఇడువను కాదన్న కదలను
నన్ను లగ్గమాడేదాకా నిన్ను ఇడిసి పెట్టాను
అశోకు అందాల బొమ్మను నేను
నా సోకు నీకే నే రాసిచ్చాను
పిల్లగా అశోకు పల్లెటూరి పడుచు పిల్లను
నా సెయ్యి పడితే ఈ పానమిస్తాను
రాతిరంతా నువ్వేరా కల్లోకొచ్చి నా నిద్దుర
ఆగంచేస్తునావు నన్నే ఎందుకురా
కళ్ళముందుకు వస్తుంటే కాసింతైన చూడవు
ఏందో నీ ఎవ్వరం ఎరుకైతున్నాదా
సిగ్గిడిసి నువ్వంటే ఇష్టమన్నారా
నీ మద్దిడిసి నా సెయ్యి నువ్వు పట్టారా
నీ తోడుంటే చాలంటూ బతుకుతున్నారా
ఓ మాటివ్వు మనసుల నిన్ను దాసుకుంటారా
ఒరేయ్ వద్దన్న ఇడువను కాదన్న కదలను
నన్ను లగ్గమాడేదాకా నిన్ను ఇడిసి పెట్టాను
ఓ అశోకు ఓయ్ అశోకు ఒరేయ్ అశోకు
అందాల బొమ్మను నేను
నా సోకు నీకే నే రాసిచ్చాను
పిల్లగా అశోకు పల్లెటూరి పడుచు పిల్లను
నా సెయ్యి పడితే ఈ పానమిస్తాను
Song Credits:
నిర్మాతలు: అశోక్‌పవర్ & రాధిక సురేష్
సాహిత్యం: మను మనోహర్
గాయకుడు: ప్రభ
సంగీతం: వెంకట్ అజ్మీరా
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.