ఆశా పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో..
సేరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏవిల్లో ఎద కొలనుల్లో
నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి ని వుంటే తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా
ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
ఆశా పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ ముడుపులో ఏం దాగున్నదో
నీవుగా తీర్చుకో నీ శైలిలో
సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కధనం
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని
పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కధలే దూరం
నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా
ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్నా
___________________________
పాట: ఆశా పాశం (Asha Pasham)
చిత్రం: కేర్ ఆఫ్ కంచరపాలెం (Care Of Kancharapalem)
నిర్మాత: పరుచూరి విజయ ప్రవీణ (Paruchuri Vijaya Praveena), MD
దర్శకత్వం: వెంకటేష్ మహా (Venkatesh Maha)
సంగీతం: స్వీకర్ అగస్తీ (Sweekar Agasthi)
సాహిత్యం: విశ్వ (Vishwa)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.