చిలుకల పాళెం అనే ఊళ్లో రామయ్య. కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు. ఒకరంటే ఒకరికి అమితిమైన ప్రేమ. ఒక్కచోటే పెరిగారు. పెళ్లిళ్లయ్యి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాలు వల్ల ఇష్టం లేకపోయినా వేరు వేరుకాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలు లేరు రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య రామయ్య కూ తమ్ముడంటే అంతే ప్రేమ అందుకే మేము ఇద్దరమే ఉంటాం. తమ్ముడికి ముగ్గరు పిల్లలు వాళ్లు చేతి కొచ్చి దాకా సంసారాన్ని ఎలా ఈదుకోస్తాడో అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్లను తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్నిలో పోసేవాడు. అలా ఏళ్లు గడిచాయి. ఒక రోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయాబోతూ ఎదురు పడ్డారు. జరుగుతున్నా విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దురూ ఆనందాశ్చర్యాలకు గురుయ్యారు. తన తమ్ముడి గొప్పదనం గురించి అన్నా అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడూ ఊళ్లో వాళ్ళకు చెప్పడంతో అన్నదమ్ములంటే రామయ్య కృష్ణయ్యల్లా ఉండాలి అని చెప్పుకునేవారు ఊరివాళ్లంతా.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.