కళ్ళకు కాటుక పెట్టి
చెవులకు జూకాలు పెట్టి
నాజూకు నడుమును జూపి
నన్నే నీ వైపు లాగి
అటువంక ఇటువంక మూతంతా తిప్పుతూ
చూసి చూడనట్టు సైగలెన్నో చేస్తూ
మొత్తంగా నన్ను మాయ చేస్తివే
అరుణమ్మో కాస్త సూడమ్మో
ఓ అరుణమ్మో అందగానమ్మో
రామయ్యో చాలు ఆపయ్యో
రామయ్యో రంది ఎందయ్యో
రేలారే రేల రేల రేల రేల రేలారే
రేలారే రేల రేల రేల రేల రేలారే
రేలారే రేల రేల రేల రేల రేలారే
రేలారే రేల రేల రేల రేల రేలారే
అట్టాగే నీ వైపు చూస్తూ
ఇట్టాగే ఉండలనుందే
మనసారా నిన్ను ప్రేమిస్తూ
నిండు నూరేళ్లు బ్రతకాలనుందే
చాలు నీ మాటల్ని ఆపు
పడిపోను నేనెప్పుడు నీకు
బంగారు పూబంతి నేను
బాదునాము చెయ్యకు పిల్లగో
అటువంక ఇటువంక మూతంతా తిప్పుతూ
సిటీకి మాటికీ చిత్రంగా అలుగుతూ
కోపంలో కూడా ముద్దుగున్నావే
అరుణమ్మో కాస్త సూడమ్మో
ఓ అరుణమ్మో అందగానమ్మో
రామయ్యో చాలు ఆపయ్యో
రామయ్యో రంది ఎందయ్యో
ఎందాకైనా తోడు వస్తా
ఏమైనా నిన్నిడిసి పెట్ట
నా రాణి మల్లె నిన్ను
పసి పాపల్లె నే చూసుకుంటా
మా వొళ్ళు ఒప్పరు పిల్లగొ
ఈ ప్రేమంటే నొప్పరు పిల్లగొ
పద్ధతిగా నువ్ వచ్చి నన్నేలుకోరో పిల్లగొ
నువ్వంటే పడి సచ్చే పిల్లగాడ్ని నేనమ్మా
మీ వోళ్ళ నోప్పించి మనువాడు తానమ్మో
నా ఇంటి మహారాణివి నువ్వమ్మో
అరుణమ్మో కాస్త సూడమ్మో
ఓ అరుణమ్మో అందగానమ్మో
రామయ్యో నచ్చినవయ్యో
ఓ రామయ్యో నీ సీత నేనయ్యో
రేలారే రేల రేల రేల రేల రేలారే
రేలారే రేల రేల రేల రేల రేలారే
రేలారే రేల రేల రేల రేల రేలారే
రేలారే రేల రేల రేల రేల రేలారే
_________________________
సాంగ్ : అరుణమ్మో కాస్త సూడమ్మో (Arunammo kastha sudammo)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmera)
లిరిక్స్: రాము కోనింటి (Ramu koninti)
గాయకులు: బొడ్డు దిలీప్ (boddu Dilip), శైలజ బట్టు (shailaja battu)
నటీనటులు: కార్తీక్ రెడ్డి (Karthik Reddy), పూజా నాగేశ్వర్ (Pooja nageshwar)
దర్శకుడు & కొరియోగ్రఫీ: రఘు జాన్ (Raghu jaan)
నిర్మాత: అంజి యాదవ్ (Anji yadav)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.