Home » అణువణువు – ఓం భీమ్ బుష్

అణువణువు – ఓం భీమ్ బుష్

by Shalini D
0 comment

చిత్రం: ఓం భీమ్ బుష్
సంగీత దర్శకుడు: సన్నీ MR
సంవత్సరం: 2024
పాట: అణువణువు
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకులు: అరిజిత్ సింగ్


ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని

తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

కలిసెనుగా కలిపెనుగా
జన్మల భందమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే

మరిచా ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ఇపుడే
పథ సందేహమే

నాలో లేదే మనసే
నీతో చేరే
మాటే ఆగి పోయే
పోయే పోయే
ఈ వేళనే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమ

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment